ఇదొక లెస్బియ‌న్ ల‌వ్ స్టోరీ.. చ‌దివితే మైండ్ బ్లాంక్‌..!

love-story

ఇది సోష‌ల్ మీడియా కాలం. ట్విట్ట‌ర్ చాటింగ్‌లు, ఫేస్‌బుక్ ప్రేమ‌లు, వాట్స‌ప్ ల‌వ్ షేరింగ్‌.. ఇదీ నేటి జ‌మానా యూత్ ట్రెండ్‌. అయితే, ఇలాంటి సోష‌ల్ మీడియా ప్రేమ‌ల‌లోనూ ఇదో వింత ల‌వ్‌. విచిత్రమైన ప్రేమ‌. సృష్టికి, ప్ర‌కృతికి విరుద్ధ‌మైన ప్రేమ‌. ఈ అస‌హ‌జ బంధ‌మే శాశ్వ‌తం కావాల‌ని, స‌హ‌జ బంధాలేవీ వ‌ద్ద‌ని చివ‌రికి క‌ట్టుకున్న భ‌ర్తకే టోక‌రా వేసింది ఓ మ‌హిళ‌, ఆమె గాళ్ ఫ్రెండ్‌.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌కి చెందిన నైనా అనే యువ‌తికి, బంగ్లాదేశ్‌కి చెందిన జ‌న్న‌త్‌కి ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం అయింది. మొద‌ట స్నేహితురాళ్లుగా ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌ర్వాత ఫోన్ నెంబ‌ర్‌లు మార్చుకున్నారు. ఆ త‌ర్వాత బోర్డ‌ర్‌ని కూడా దాటి వాట్స‌ప్ ఫోన్‌ల‌తో కబుర్లు చెప్పుకునేవారు. అటు వైపు నుంచి ఫోన్ మాట్లాడుతోంది అమ్మాయే కాబ‌ట్టి.. ఇరు వైపులా కుటుంబాల‌కి ఎలాంటి అభ్యంత‌రం లేక‌పోయింది. ఇలా, ఇద్ద‌రి మ‌న‌సులు క‌లిశాయి. దీంతో, త‌న స్నేహితురాల్ని చూడాల‌ని జ‌న్న‌త్‌.. ఓ రోజు ఏకంగా సూట్‌కేసు స‌ర్దేసుకొని బంగ్లాదేశ్ నుంచి ఇండోర్‌కి వ‌చ్చింది. మొద‌ట నాలుగు రోజులు ఉండి పోతుంది అనుకున్నారు నైనా త‌ల్లిదండ్రులు. ఇటు దేశం కాని దేశం నుంచి వ‌చ్చిన అమ్మాయిని బాగా చూసుకున్నారు. అయితే, నైనా బల‌వంతంతో జ‌న్న‌త్.. ఆమె చ‌దివే కాలేజ్‌లోనే చేరింది. మొద‌ట హాస్ట‌ల్‌లో ఉంటానన్నా.. నైనా ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఆమె ఇంట్లోనే ఉండ‌నిచ్చారు త‌ల్లిదండ్రులు.

అయితే, నైనాకి మ్యాచ్ సెట్ చేశారు ఆమె త‌ల్లిదండ్రులు. అయితే, నైనా వారికి చిన్న కండిష‌న్ పెట్టింది. అలా అయితేనే పెళ్లికి ఓకే అంటూ ష‌రతు విధించింది. దీంతో, మొద‌ట అయిష్టంగానే ఒప్పుకున్నారు పెద్ద‌లు. పెళ్ల‌యితే అన్నీ మ‌రిచిపోతుంద‌ని భావించారు. వీళ్ల విచిత్ర స్నేహ బంధాన్ని చూసి కంగారుపడ్డా.. ‘ఆ మూడుముళ్లు’ పడితే కూతురి మనసు మారిపోతుందని భావించారు నైనా తల్లిదండ్రులు. జన్నత్ విషయం తెలియనీయకుండా మహేశ్ అనే కుర్రాడితో నైనా పెళ్లి జరిపించారు. హ‌నీమూన్ ఏర్పాట్లు కూడా చేశారు.

హనీమూన్ కోసమని గోవా బయలుదేరగా జన్నత్‌ని కూడా తీసుకుపోతాన‌ని భ‌ర్త ముందు గారం చెయ్య‌డంతో ఆయ‌న వెంట‌నే ఓకే అన్నాడు. అక్కడినుంచే మ‌నోడికి అస‌లు నిజం తెలియ‌డం షురూ అయింది.  గోవా వెళ్లాక మహేష్‌ని హోటల్‌ గదిలో ఉంచి, బయటి నుంచి తాళంవేసి నైనా, జన్న‌త్‌ షికార్లకు వెళ్లేవారు. ఇదేంటి అని నిలదీసిన భర్తపై నైనా వేధింపుల కేసు పెట్టింది.

ద‌ర్యాప్తు చేసిన పోలీసుల‌కు అసలు నిజాలు తెలిసి షాక్ అయ్యారు. నైనా, జ‌న్న‌త్‌.. భార్యాభ‌ర్త‌లుగా భావించుకుంటున్నార‌న్న సంగ‌తి తెలిసింది. జన్నత్ మొబైల్‌లో నైనా నంబర్ ‘వైఫ్’గా ఫీడ్ చేసుకోగా, నైనా.. జన్నత్ నంబర్ ను ‘హబ్బీ’అని ఫీడ్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మూడేళ్ల నుంచి సాగుతున్న ఈ విచిత్ర బంధాన్ని పోలీసులు ఇటీవలే పరిష్కరించారు. జన్నత్, నైనాలు కలిసి జీవించేందుకు వారి తల్లిదండ్రులు అంగీకరించారని, అదే సమయంలో మహేశ్ పై పెట్టిన వేధింపుల కేసును ఉపసంహరించుకునేందుకు అంగీక‌రించడం అస‌లు కొస‌మెరుపు.

 

Loading...

Leave a Reply

*