చారిత్రాత్మ‌క టెస్ట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా..!

team-india

కివీస్‌తో జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్‌.. భార‌త్‌కి చారిత్రాత్మ‌క టెస్ట్ మ్యాచ్‌. ఇది భార‌త్‌కి 500వ టెస్ట్ మ్యాచ్‌. ఈ హిస్టారిక‌ల్ టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. కివీస్‌ని ఓడించి మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది.కాన్‌పూర్‌లో జ‌రుగుతున్న ఈ తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో భార‌త్ త‌డ‌బ‌డింది. మొద‌ట 318 పరుగుల‌కే చాప చుట్టేసింది. అయితే, రెండో రోజు కివీస్‌.. తొలి వికెట్‌కి 152 ప‌రుగులు సాధించ‌డంతో సొంత గ‌డ్డ‌పై భార‌త్‌కి ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌నుకున్నారంతా. కానీ, భార‌త్ బౌల‌ర్‌లు మేజిక్ చేశారు. 27 బంతుల్లో 5 వికెట్‌లు ప‌డ‌గొట్టి కివీస్‌ని 262 ప‌రుగుల‌కే క‌ట్డ‌డి చేశారు మ‌న స్పిన్ బౌలర్‌లు జ‌డేజా, అశ్విన్‌.

సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ జూలు విదిల్చారు. 376 ప‌రుగుల‌కి 5 వికెట్‌లు కోల్పోయిన త‌ర్వాత వెంట‌నే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు కెప్టెన్ కోహ్లి. టెస్ట్‌ల‌లో స‌రిగ్గా రాణించలేక‌పోతున్న రోహిత్ శ‌ర్మ సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ సాధించాడు.ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ కివీస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు మ‌న బౌల‌ర్‌లు. 236 ప‌రుగుల‌కే కివీస్‌ని పెవిలియ‌న్‌కు పంపారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో భార‌త్ స్పిన్నర్ అశ్విన్‌.. కివీస్ వెన్ను విరిచాడు. 162 ప‌రుగులిచ్చి 6 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆయ‌న మూడు వికెట్‌లు నేల‌కూల్చాడు. మొత్త‌మ్మీద‌, 500వ టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్‌.. 197 పరుగుల తేడాతో కివీస్‌ని ఓడించింది. రెండో టెస్ట్ మ్యాచ్ శుక్ర‌వారం నుంచి కోల్‌క‌తాలో జ‌ర‌గ‌నుంది.

Loading...

Leave a Reply

*