త‌మ్ముడికి షాక్ ఇచ్చిన అన్న‌.. వెనుక లోకేష్ హ్యాండ్‌…?

lokeah

ఎన్టీఆర్ వ‌ర్సెస్ తార‌క‌ర‌త్న‌.. ఈ ఇద్ద‌రికీ ఎందులో పోటీ అనుకుంటున్నారా..? అదేం లేదు. యంగ్‌టైగ‌ర్ క్రేజ్‌కి, ఇమేజ్‌కి, తార‌క్ ర‌త్న ఇమేజ్‌కి అస‌లు పోలిక‌లే లేవు. పాపులారిటీలోనూ సేమ్‌. గతంలో టీడీపీకి తార‌క్ దూర‌మ‌యిన సంద‌ర్భంలో.. లోకేష్‌, బాల‌య్య టీమ్ తార‌క‌ర‌త్న‌తోనే వారిపై సెటైర్‌లు వేయించింది. గ‌త ఎన్నిక‌ల‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.అయితే, మ‌రోసారి ఇదే వార్త చ‌ర్చ‌నీయాంశం అయింది. తార‌క్‌కి 9999 అనే కార్ నెంబ‌ర్ అంటే త‌గ‌ని ఇష్టం. ఆ నెంబ‌ర్ కోసం ఆయ‌న ఎంతైనా ఖ‌ర్చు పెట్ట‌డానికి సిద్ధం. గ‌తంలో ఈ నెంబ‌ర్ కోసం తార‌క్ ఏకంగా ఆరు ల‌క్ష‌ల వ‌ర‌కు వెచ్చించాడు.

సేమ్ టు సేమ్ అదే నెంబ‌ర్ మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెంబ‌ర్ కోసం రీసెంట్‌గా ఏపీ రాజ‌ధాని ప‌రిధిలోని గుంటూరులో వేలానికి వ‌చ్చింది. అంతే, అది తెలిసి తార‌కర‌త్న ఏకంగా ఆరు ల‌క్ష‌లు వెచ్చించి తీసుకున్నాడు. కానీ, ఈ బిడ్డింగ్‌కి తార‌క్ దూరంగా ఉండ‌డం విశేషం. 9999 నెంబ‌ర్ ఎక్క‌డ వ‌చ్చినా వేలానికి సిద్ధంగా ఉండే తార‌క్‌.. తాత పెట్టిన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మాత్రం వెనుక‌డుగు వెయ్య‌డం హాట్ టాపిక్‌గా మారింది.అయితే, దీనికి రెండు ర‌కాల వెర్ష‌న్‌లు వినిపిస్తున్నాయి. ఒక‌టేంటంటే.. తార‌క్‌కి ఈ వేలంపాట గురించి అస‌లు తెలియ‌దని, అందుకే ఆయ‌న దూరంగా ఉన్నాడ‌ని చెబుతున్నారు.

మరికొంద‌రు మాత్రం ఈ మేట‌ర్ ముందే తెలుస‌ని, అయినా గుంటూరులో వేలం అంటే అంతా లోకేష్ క‌నుసన్న‌ల్లో న‌డుస్తుంద‌ని భావించిన తార‌క్‌.. తొంద‌ర ప‌డ‌కూడ‌ద‌నుకున్నాడ‌ట‌. అంతేకాదు, తార‌క‌ర‌త్న‌కి ఆ నెంబ‌ర్ కేటాయించ‌డం వ‌ల్ల‌.. తార‌క్‌కి ఇష్ట‌మైన నెంబ‌ర్‌ని మ‌రొక‌రిని కేటాయించం అనే హింట్ కూడా పంపిన‌ట్ల‌వుతుంద‌ని లోకేష్ టీమ్ లెక్క‌లు క‌ట్టిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ విష‌యం తార‌క్‌కి పూర్తిగా అర్ధ‌మ‌యిన త‌ర్వాతే వేలంపై సైలెంట్‌గా ఉన్నాడ‌ట‌. మ‌రి, ఇందులో నిజ‌మెంత అనేది నంద‌మూరి హీరోల‌కే తెలియాలి.

Loading...

Leave a Reply

*