వ్య‌భిచారం కేసులో బాల‌కృష్ణ పీఏ అరెస్ట్‌..!

tamilnadu-minister-balakrishna-pa-arrested-in-prostitution-case

బాల‌కృష్ణ ఏపీ అడ్డంగా బుక్క‌య్యారు. వ్య‌భిచారం కేసులో ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. త‌మిళ‌నాడు మినిస్ట‌ర్ బాల‌కృష్ణ పీఏ.. గ‌త కొన్నాళ్లుగా చెన్నై న‌గ‌రంలో సెలూన్‌, మ‌సాజ్ సెంట‌ర్‌ల ముసుగులో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నారు. ప‌లువురు వ‌నిత‌ల‌ను తీసుకువ‌చ్చి, మ‌సాజ్ సెంట‌ర్‌లోనే మ‌కాం పెట్టించాడు. మంత్రి పీఏని త‌న‌ను ఏం చేస్తార‌న్న ఆలోచ‌న‌తో ఆయ‌న ఇలాంటి ప‌నులు చేస్తున్నారు. ఈ విష‌యం చెన్నై న‌గ‌ర పోలీసుల దృష్టికి వ‌చ్చింది. దీంతో, ప‌క్కా నిఘా వేసి మ‌రీ ప‌ట్టుకున్నారు పోలీసులు.

సిటీలో ఆయ‌న నిర్వ‌హిస్తున్న ప‌లు మ‌సాజ్ సెంట‌ర్‌లు, సెలూన్‌ల‌పై ఏకకాలంలోనే దాడులు చేసి మ‌రీ కొంత‌మంది విటుల‌ను, మహిళ‌ల‌ను ఆరెస్ట్ చేశారు. అదే టైమ్‌లో మంత్రి బాల‌కృష్ణా రెడ్డి పీఏ స‌త్య‌నారాయ‌ణని అదుపులోకి తీసుకున్నారు.

కోల్‌క‌తా నుంచి కొంత‌మంది నిరుద్యోగ యువ‌తుల‌ను ఉద్యోగం పేరుతో బుట్ట‌లోకి లాగి.. వారిని ఈ రొంపిలోకి దింపుతున్నాడ‌ట బాల‌కృష్ణ పీఏ. ఎవ‌రయినా ఎదిరిస్తే వారిని త‌న అధికార బ‌లంతో బెదిరిస్తున్నాడ‌ట‌. దీంతో, కొంత‌మంది అమ్మాయిలు బ‌య‌ట‌ప‌డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, ప‌క్కా నిఘా వేసి మ‌రీ ప‌ట్టుకున్నారు చెన్నై స్పెష‌ల్ పోలీసులు. ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు.

 

Loading...

Leave a Reply

*