అంత‌మంది చ‌స్తుంటే అంతా బావుందా? మోడీకి త‌లంటిన సుప్రీం కోర్టు

untitled-2-copy

నోట్ల ర‌ద్దుపై ప్ర‌భుత్వ తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా త‌ప్పు బ‌ట్టింది. బ్యాంకుల వ‌ద్ద క్యూలో నిలుచుని అంత‌మంది చ‌నిపోతుంటే అంతా బావుంద‌ని ఎలా చెబుతార‌ని నిల‌దీసింది. నోట్ల ర‌ద్దుపై వివిధ కోర్టుల‌లో దాఖ‌లైన పిటిష‌న్ల‌పై విచార‌ణ‌ను నిలిపివేయాల‌ని కోరుతూ కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. దానిపై విచారించిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం… మోడీ ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌ట్టింది. పిటిష‌న్ల‌పై విచార‌ణ‌ను నిలిపివేసేందుకు నిరాక‌రించింది. త‌గు ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా ఎందుకు ఇంతటి తీవ్ర నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌శ్నించింది.

బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల‌కు డ‌బ్బును త‌ర‌లించ‌డంలో స‌మ‌స్య‌లున్నాయ‌ని ప్ర‌భుత్వం చెప్ప‌డంతో ఇవ‌న్నీ చూసుకోకుండా ఎందుకు ముందుకు వెళ్లార‌ని ప్ర‌శ్నించింది. నోట్ల‌మార్పిడి ప‌రిమితిని నాలుగున్న‌ర వేల నుంచి రెండు వేల‌కు కుదించ‌డంపై కూడా తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తంచేసింది. దేశ‌వ్యాప్తంగా నోట్ల‌ర‌ద్దుపై దాఖ‌లైన పిటిష‌న్ల విచార‌ణ‌పై స్టే ఇవ్వ‌లేమ‌ని కావాలంటే అన్నింటినీ ఢిల్లీ హైకోర్టుకు మారుస్తామ‌ని తెలిపింది.

Loading...

Leave a Reply

*