ప‌నిమ‌నిషితో భ‌ర్త అక్ర‌మ‌సంబంధం…గోలెత్తిపోతున్న స్టార్ హీరోయిన్‌…!

untitled-16

ఆమె ఒక స్టార్ హీరోయిన్‌. ద‌క్షిణాది చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఆమె త‌న‌కంటూ స్పెష‌ల్ క్రేజ్‌ని ద‌క్కించుకుంది. ఆమె మంచి అంద‌గ‌త్తె. ఆమె అందానికి ఫిదా అయిన యూత్ వేల సంఖ్య‌లో ఉన్నారు. ఆవిడ సీనియ‌ర్ హీరోయిన్‌. ఆమె కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నా.. చివ‌రికి ఓ వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. అయితే, ఆయ‌న ఇటీవ‌ల త‌న ఇంట్లో ప‌నిచేసే ప‌నమ్మాయితోనే అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడ‌ట‌. దీనిపై ఆమె ఎంత నిలదీసినా లైట్ తీసుకుంటున్నాడ‌ట‌. చివ‌రికి, ఆమె విడాకులు ఇస్తాన‌న‌నే స‌రికి ఆయ‌న సైలెంట్ అయ్యాడ‌ట‌.

స‌ద‌రు హీరోయిన్‌గారి భర్తకి సంపాద‌న లేక‌పోవ‌డంతో ఆమె మీదే ఆధార‌ప‌డి బ‌తుకీడుస్తున్నాడ‌ట‌. దీంతో, ఆ హీరోయిన్ బెదిరింపుల‌తో రోడ్డు మీద ప‌డ‌తాన‌న్న భ‌యంతో త‌న వంటింట్లో ప్రియురాలికి గుడ్ బై చెప్పేందుకు అయిష్టంగానే రెడీ అయ్యాడ‌ట‌.ఇదంతా ఓ కేర‌ళ హీరోయిన్ రియ‌ల్ స్టోరీ. త‌న భ‌ర్త ఇలా చేస్తున్నాడంటూ ఇండ‌స్ట్రీలోని క్లోజ్ ఫ్రెండ్స్‌తో చెప్పుకొని వాపోయింద‌ట‌. దీంతో, ఏం చెప్పాలో తెలియ‌క వారు స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌. మ‌రోవైపు, ఆ ప‌నిమ‌నిషే ఆ హీరోయిన్ భార్య‌పై ప‌లువురికి ఫిర్యాదులు చేసింద‌ని స‌మాచారం.

ఎలాగ‌యితేనేం.. మేట‌ర్ మీడియా దాకా వ‌చ్చింది. ఇప్పుడు అంతా ఆ హీరోయిన్ భర్త అక్ర‌మ సంబంధంపైనే గుస‌గుస‌లాడుకుంటున్నారు. మ‌ల్లూవుడ్‌లో ఇదో పెద్ద సెన్సేష‌న్‌గా మారింది. ఈ ఎపిసోడ్‌ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలుగా మారింద‌ని చెప్పుకుంటున్నారు.అక్క‌డి మీడియా ఆ స్టార్ హీరోయిన్ పేరుపై క్లూలు కూడా ఇస్తున్నాయి. ఆమె నిన్న‌టిదాకా సౌత్‌లో హీరోయిన్‌గా అన్ని భాష‌ల‌లోనూ మంచి మంచి సినిమాలు చేసింద‌ట‌. ఆ త‌ర్వాత హిందీలోనూ ఒక‌టీ అరా సినిమాలు చేసింద‌ని లీక్‌లు ఇస్తోంది. ఇంత‌కీ ఆమె ఎవ‌ర‌బ్బా..?

Loading...

Leave a Reply

*