సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ ఆన్‌లైన్ చావు!

software

జీవితంపైన విర‌క్తి క‌లిగిందో… జీవించింది చాల‌ని అనిపించిందో తెలియ‌దు కానీ ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బ‌ల‌వంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న ఆ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ చ‌చ్చే ముందు మాత్రం ఏ మాత్రం నొప్పి లేకుండా సుఖంగా పోవాల‌ని పెద్ద‌ప్లానే వేశాడు. చివ‌ర‌కు ప్ర‌శాంతంగా మూడో కంటికి తెలియ‌కుండా ప్రాణం తీసేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ తన చ‌దువును, విజ్ఞానాన్ని బ‌ల‌వంత‌పు చావు కోసం ఉప‌యోగించాడు. ఏ మాత్రం నొప్పి లేకుండా ఏలా చ‌నిపోవాలా అని నెట్లో సెర్స్ చేసి మ‌రీ చ‌చ్చిపోయాడు. ఇందుకోసం ఆన్‌లైన్‌లోనే కార్బ‌న్ మోనాక్సైడ్‌ను కొనుగోలు చేశాడు.

ఇందుకు తాను శాస్ర్తీయ ప‌రిశోధ‌న‌ల‌కు ఉప‌యోగించేందుకు కావాలంటూ దాన్ని కొనుగోలు చేశాడు. ఆ కార్బ‌న్ మోనాక్సైడ్ సిలిండ‌ర్‌ను ఓపెన్ చేసి త‌న త‌ల చుట్టూ ఒక పాలిథిన్ క‌వ‌ర్‌ను చుట్టుకుని ఓపెన్ చేసిన సిలిండ‌ర్లో త‌ల దూర్చి దాని గాలి పీల్చాడు. దాంతో క్ష‌ణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. నిండా పాతికేళ్లు కూడా లేని ఆ యువ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ చేసుకున్న ఈ అఘాయిత్యాన్ని చూసిన స్థానికులు దిగ్ర్భాంతికి గుర‌య్యారు. కాగా, దేశంలోనే ఇలా కార్బ‌న్ మోనాక్సైడ్‌ను పీల్చి చ‌చ్చిపోవ‌డం ఇదే తొలిసార‌ని వైద్య రంగంలోని నిపుణులు చెబుతున్నారు. శ‌రీరానికి ఏ మాత్రం ఇబ్బంది క‌లిగించిన ఈ వాయువు ర‌క్తంలోని ఆక్సిజ‌న్ బ‌దులు వ్యాపించేసి క్ష‌ణాల్లోనే ప్రాణాలు తీసేస్తుంద‌ని వారు పేర్కొన్నారు.

Loading...

Leave a Reply

*