మల్టీప్లెక్స్‌ల‌లో ఇక పాప్‌కార్న్ బంద్‌.. సోష‌ల్ మీడియాలో ఉద్యమం…!

untitled-11

మీరు మ‌ల్టీప్లెక్స్‌ల‌లో సినిమా చూస్తారా..? అక్క‌డ పాప్ కార్న్ తింటారా.? మీకేమి అనిపిస్తుంది..? దాని కాస్ట్ వీర బాదుడు అనిపించ‌డం లేదా.?? అవును, ఇలా జేబుల గుల్ల‌తో గుండెలు మండిన చాలా మంది ఇప్పుడు పోరాటం మొద‌లు పెట్టారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం హోరెత్తిస్తున్నారు. మ‌ల్టీప్లెక్స్‌ల‌లో పాప్‌కార్న్‌ను బాయ్‌కాట్ చేయాల‌ని ఓ ఉద్య‌మం షురూ చూపిస్తున్నారు.సినిమా హాల్స్‌లో పాప్ కార్న్ ధ‌ర‌లు మ‌రీ చుక్క‌లు చూపిస్తున్నాయ‌ని, మిడ్ సైజ్ ట‌బ్ ప్యాక్ ధ‌ర‌.. రూ.190, రూ.270వ‌ర‌కు ఉంటోంది.

ఇది మ‌రీ దారుణ‌మ‌ని ఏకంగా స్టాల్స్ ఓనర్స్‌తో, మ‌ల్టీప్లెక్స్‌ల యాజ‌మాన్యంతో కంప్ల‌యింట్‌లు చేసే వాళ్లు బోలెడు మంది. వారు లైట్ తీసుకోవ‌డంతో జీహెచ్ఎమ్‌సీకి ఫిర్యాదు చేసినా నో యూజ్‌. దీంతో, అలాంటి బాధితులంతా ఇప్పుడు సోష‌ల్ మీడియాని ఆశ్రయిస్తున్నారు.వారి లెక్క‌ల ప్ర‌కారం.. పాప్ కార్న్ ట‌బ్‌లోని ఒక్కో పాప్ కార్న్ ధ‌ర ఏకంగా 1 రూపాయికిపైనే ఉంటుంది. అంటే ఒక్క‌సారి అంచ‌నా వెయ్యండి.. బ‌య‌ట చాలా చీప్‌గా దొరికే పాప్‌కార్న్‌ని వారు ఏ రేంజ్‌లో అమ్ముతున్నారో..? మ‌న జేబుకి చిల్లులు పెడుతున్నారో..? ఒక్కో స్టాల్ య‌జమానికి ఒక్కో థియేట‌ర్‌లో రోజుకి వేల‌ల్లో సంపాదిస్తున్నాడ‌ట‌.

కొన్ని మ‌ల్టీప్లెక్స్‌ల‌లో అయితే అది ఏకంగా ల‌క్ష‌ల్లో ఉంటుంద‌ట‌. ఇదే వారికి ఆయుధంగా మారుతోంది. దీనిని వేదిక‌గా చేసుకొని పోరాటం ఉధృతం చేస్తున్నారు. ఎంత‌గా వాదించినా మ‌ల్టీప్లెక్స్ స్టాల్ యాజ‌మాన్యాలు దిగి రాక‌పోవ‌డంతో.. సోష‌ల్ మీడియాని ఆశ్ర‌యిస్తున్నారు. వారిపై పోరాటం చేస్తున్నారు. మీరు కూడా అలాంటి బాధితుల‌యితే ఓ చెయ్యి వెయ్యండి. ప్రేక్షకుల డిమాండ్ కు దిగొవచ్చి జీహెచ్ఎంసీ మల్టిఫ్లెక్స్ లో వర్తకులు విధిస్తున్న ఈ స్నాక్ ఐటమ్స్ ధరలు నియంత్రిస్తుందో లేదో చూడాలి.

Loading...

Leave a Reply

*