మీ నెట్ క‌నెక్ష‌న్ స్లో గా ఉందా.. ఇలా చెయ్యండి సూప‌ర్ ఫాస్ట్ గ్యారంటీ..!

net

ఇది ఇంట‌ర్‌నెట్ యుగం. మనం తీసుకున్న క‌నెక్షన్ మొద‌ట్లో ఫాస్ట్‌గా ఉంటుంది. అప్‌లోడ్‌లు, డౌన్‌లోడ్‌లు కూడా చాలా వేగంగా జ‌రుగుతుంటాయి. రెండు నెలలు, మూడు నెల‌ల గ‌డిచేస‌రికి ఒక్కసారిగా స్లో అయిపోతుంటాయి. వీడియో బఫ‌రింగ్‌కి చాలా స‌మయం తీసుకుంటుంది. ఇక‌, ఫోటోలు అప్‌లోడ్ చేసుకోవాల‌న్నా, డౌన్‌లోడింగ్ పెట్టుకోవాల‌న్నా అది కుద‌ర‌నిప‌ని. ఈ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం ఏంట‌నేది చాలా మందికి తెలియ‌దు. త‌గ్గిన నెట్ స్పీడ్‌ని మ‌ళ్లీ స్పీడ్ పెంచుకోవ‌డం కూడా చాలామందికి తెలియ‌దు. చిన్న చిన్న చిట్కాల‌తో వెంట‌నే నెట్ స్పీడ్ పెంచ‌వ‌చ్చు.

అస‌లు ముందు స్పీడ్ ఎందుకు త‌గ్గుతుందో ఓ లుక్కేద్దాం..
మీ ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఎక్కువ మందికి షేర్ చెయ్య‌డం, బ్రౌజ‌ర్‌లో కాచె ఎక్కువ‌గా మిగిలిపోవ‌డం, వెబ్‌సైట్స్‌లో వ‌చ్చే యాడ్స్‌తో వైర‌స్ పెర‌గ‌డం, మీ బ్రౌజ‌ర్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు రిఫ్రెష్ చెయ్య‌క‌పోవ‌డం వంటివి మీ నెట్ స్పీడ్‌ని చాలా వ‌ర‌కు త‌గ్గిస్తాయి. మీ నెట్ స్పీడ్ ఎంత ఫాస్ట్‌గా ఉందో తెలుసుకునేందుకు స్పీడ్ టెస్ట్ లేదా గూగుల్ పేజ్ స్పీడ్ ద్వారా టెస్ట్ చేసుకోవ‌చ్చు.

మీ నెట్ స్పీడ్‌ని పెంచుకునే మార్గాలు..

— మీ వైఫై రూట‌ర్‌ని బాగా వెలుతురు ఉన్న ప్ర‌దేశాల‌లో ఉంచాలి. అదే స‌మ‌యంలో త‌రంగాలు ఎక్కువ‌గా ఉంటున్నాయా? లేదా..? అనేది కూడా చెక్ చేసుకోవాలి.
— ఇక‌, మీ వైఫై పాస్‌వర్డ్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు మారుస్తూ ఉండాలి. లేదంటే, మ‌న‌కు తెలియ‌కుండానే.. మీ ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్‌ని వేరే వాళ్లు యూజ్ చేసుకునే చాన్స్ ఉంటుంది.
— బ్రౌజ‌ర్‌ని ఎప్పుటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ కూడా కొత్త‌ద‌యి ఉండాలి.
— నెట్ వర్క్ కార్డ్ పాత‌దాని స్థానంలో కొత్త‌ది వేసుకోవాలి.
— ఒకే క‌నెక్ష‌న్‌కు ఎక్కువమంది యూజ‌ర్‌లు ఉన్నా స్పీడ్ దారుణంగా పడిపోతుంది. ఈ విష‌యంలో మీ డేటా ప్యాకేజ్‌ని పెంచుకోవాలి.
— క్యాచె ఫైల్స్‌ని ఎప్పటిక‌ప్పుడు తొలగించుకోవాలి. రిఫ్రెష్ అవుతూ ఉండాలి.
— రూట‌ర్‌ని కూడా కొంత కాలం తర్వాత మార్చుకుంటే మంచిది.
ఈ చ‌ర్య‌లు స‌రిగ్గా ఫాలో అయితే మీ నెట్ మ‌ళ్లీ సూప‌ర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఇక‌, ఎంచ‌క్కా మ‌ళ్లీ జామ్ జామ్‌గా ఎంజాయ్ చేయొచ్చు.

Loading...

Leave a Reply

*