సింధు ముందు సానియా, సైనా ఔట్

saniya

నిన్న‌టిదాకా ఇండియ‌న్ స్పోర్ట్స్ రంగంలో వాళ్లిద్ద‌రే మ‌హారాణులు.. క్రికెటేత‌ర క్రీడా రంగానికి వాళ్లిద్ద‌రు మ‌కుటం లేని మ‌హారాణులు…. ఆట‌లోనే కాదు సంపాద‌న‌లో కూడా వాళ్లే టాప్ లేడీస్‌…. ఒక‌రు టెన్నిస్ బ్యూటీ క్వీన్ సానియా మీర్జా అయితే మ‌రొక‌రు బ్యాడ్మింట‌న్ బేబీ సైనా నెహ్వాల్‌… తమ ఆట‌తో అద‌ర‌గొట్టిన వీళ్లిద్ద‌రు యాడ్స్‌లో కూడా దుమ్ము రేపారు… యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు.. అయితే వీళ్లిద్ద‌రి హ‌వాకు ఇప్పుడు బ్రేక్ ప‌డిండి.. సానియాను, సైనాల ఆట‌ను బ్రేక్ చేసి వాళ్లను షేక్ చేస్తూ పీవీ సింధు రాకెట్‌లా దూసుకువ‌చ్చింది…. ఆట‌లో వాళ్లిద్ద‌ర్ని మించిన సింధు ఆదాయంలో కూడా అద‌ర‌గొడుతోంది…

వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో వారెవ్వా అనిపిస్తోంది… యాడ్స్‌లో కూడా దుమ్ము రేపుతోంది…. ఇప్పుడు ఇండియాలో బ్యాడ్మింట‌న్‌కు ఆమె బ్రాండ్‌… ఇప్పుడు బ్రాండ్‌..మింట‌న్ స్టార్‌గా అవ‌త‌రించింది సింధు… తాజాగా సింధు కుదుర్చుకున్న వాణిజ్య ప్ర‌క‌ట‌నల ఒప్పందం విలువ అక్ష‌రాలా 50 కోట్లు… ఇది దేశంలోనే రికార్డులు సృష్టిస్తోంది… స‌చిన్‌, ధోనీ, కోహ్లీ లాంటి క్రికెట్ స్టార్ల‌ను మిన‌హాయిస్తే… క్రికెటేత‌ర స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్‌కు ఇంత భారీ ఆదాయం ఎప్పుడు రాలేదు… సింధుకు ఇది బిగినింగ్ మాత్ర‌మే….

బిందువు బిందువు క‌లిసి సింధువు అయిన‌ట్టు ఈ ఒలింపిక్స్ ర‌జ‌త ప‌త‌క విజ‌య బిందువు… మ‌రిన్ని కోట్లు త‌న రాకెట్‌తో కొల్ల‌గొట్టేందుకు రెడీ అవుతోంది… సింధు స్పీడ్ చూసి ఇప్పుడు సానియా, సైనా షాక్ అవుతున్నారు… సింధు ముందు వాళ్లు ఔట్ అంటున్నారు జ‌నం… ఇప్పుడు క్రీడా భార‌తంలో మ‌కుటం లేని మ‌హారాణి సింధు అంటూ జ‌నం జై కొడుతున్నారు… సింధు జోరు చూసి సానియా, సైనా బేజార‌వుతున్నారు.. సింధు ఆట‌లోనే కాదు ఆదాయంలో కూడా వాళ్ల‌ని మించిపోయి అద‌ర‌గొడుతోంది.

Loading...

Leave a Reply

*