ఢిల్లీలో శిశువులు తాగుతున్న సిగ‌రేట్ లెక్కెంత‌

untitled-17

దేశ రాజ‌ధానిలో ఇప్పుడు కాలుష్యం కాటు జ‌నాన్ని చంపేస్తుంది. ఊపిరి స‌ల‌ప‌నీయ‌కుండా రోగాల ఉచ్చులోకి లాగేస్తుంది. ఆస్ప‌త్రుల పాలు చేస్తోంది. ఒక్కో మ‌నిషి రోజుకు 40 సిగ‌రేట్లు తాగుతున్నంత కాలుష్యం ఇప్పుడు ఢిల్లీని ప‌ట్టి పీడిస్తోంద‌ని వార్త‌లొస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఢిల్లీలోని ఒక బ‌స్టాప్ వ‌ద్ద ఒక యువ‌కుడు క్ష‌మించ‌రాని దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. బ‌స్టాప్‌లో ఒక మ‌హిళ ప‌సికందును ఒడిలో పెట్టుకుని కూర్చుంది. ఆమె ప‌క్క‌నే ఒక యువ‌కుడు కూర్చుని ఉన్నాడు. కొద్ది స‌మ‌యం గ‌డిచిన త‌ర్వాత ఆ యువ‌కుడు స్టైల్‌గా సిగ‌రేట్ తీసి అంటించాడు. దాన్ని గ‌ట్టిగా పీల్చి… ఒక్క‌సారిగా ప‌క్క‌నున్న మ‌హిళ ఒడిలోని ప‌సికందుపై వ‌దిలాడు.

ఈ దారుణాన్ని చూసిన అక్క‌డి వారంద‌రికీ కోపం న‌షాళానికి అంటింది. అంద‌రూ క‌లిసి ఆ యువ‌కుడిని కొట్ట‌బోయారు. ప‌రిస్థితి చేయిదాటి పోతుంద‌ని గ్ర‌హించిన ఆ యువ‌కుడు కాళ్ల బేరానికి వ‌చ్చాడు. ఒక్క నిమిషం త‌న మాట వినాల‌ని ప్రాధేప‌డి… మ‌హిళ ఒడిలోని ప‌సికందును తీసి చూపించాడు. తీరా చూస్తే ఆదో బుజ్జాయి బొమ్మ‌. ఢిల్లీలో కాలుష్యం ఏ రేంజ్‌లో ఉందో చెప్పేందుకే తానీ బొమ్మ‌తో ప్ర‌త్య‌క్షంగా చూపే ప్ర‌య‌త్నం చేశాన‌ని చెప్పాడు. తాను వ‌దిలిన పొగ‌తో ఆ చిన్నారి ఎలా ఉక్కిరి బిక్కిరి అవుతాడో ఊహించి మీరంతా నా పై దాడికి వ‌చ్చారు. అయితే, ఇదే స్థాయిలో కాలుష్యాన్ని పీలుస్తూ… జ‌నం ప‌డుతున్న ఇబ్బందిపైనా ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించ‌డంటూ వారిని కోరాడు.

Loading...

Leave a Reply

*