చిన్నారి పెళ్లి కూతురి హీరోయిన్ తో వ్య‌భిచారం….!

1

ఇటీవ‌ల చ‌నిపోయిన బుల్లితెర పాపుల‌ర్ న‌టి ప్ర‌త్యూష బెన‌ర్జీ గుర్తుందా…? ఆమె మ‌ర‌ణం ఎంతో వివాదాస్ప‌దం అయింది. ఆత్మ‌హ‌త్య అని కొంద‌రు, ప్రియుడు పెళ్లికి నిరాక‌రించ‌డంతో చ‌నిపోయిందని మ‌రికొంద‌రు చెబుతున్నారు. అయితే, ఆమె మ‌ర‌ణంపై ముంబై మిర్ర‌ర్ సంచ‌ల‌న క‌థనాన్ని ప్ర‌చురించింది. ప్ర‌త్యూష మాట్లాడిన చివ‌రి ఫోన్ కాల్స్ లిస్ట్ ఆధారంగా ముంబై మిర్ర‌ర్ అనేక‌షాకింగ్ విష‌యాల‌ను వెలుగులోకి తెచ్చింది.ప్ర‌త్యూష బాయ్ ఫ్రెండ్, ఆమె స‌హ‌న‌టుడు రాహుల్ రాజ్‌.. ఆమెను ఇత‌రుల ద‌గ్గ‌ర‌కి వేశ్య‌గా పంపే య‌త్నం చేశాడ‌ని, దీనిని ఆమె భ‌రించ‌లేక‌పోయింద‌ని ఆ ఫోన్ కాల్స్ లిస్ట్ ద్వారా అర్ధ‌మ‌వుతుంద‌ని తెలిపింది.

ఈ విష‌యంలో రాహుల్ ప్ర‌ద‌ర్శించిన తీరును ఆమె తీవ్రంగా వ్య‌తిరేకించినా.. ప్రియుడు మాత్రం ప్ర‌త్యూష‌ను బ‌ల‌వంతపెట్టాడ‌ని ఆ క‌థ‌నంలో వివ‌రించింది.ఓ కాల్‌లో ఆమె రాహుల్‌తో తీవ్రంగా వాగ్యుద్దం చేసినట్లు తెలుస్తోంది. న‌న్ను అమ్ముకోవ‌డానికి ఇక్క‌డికి రాలేదు.. నేను న‌టించ‌డానికి వ‌చ్చాను. ప‌ని చేసుకోవ‌డానికి వ‌చ్చాను. నువ్వు న‌న్ను ఎక్క‌డికి పంపుతున్నావు. ఎంత బాధ‌ప‌డుతున్నానో నువ్వు అర్ధం చేసుకోలేక‌పోతున్నావు… అంటూ ప్ర‌త్యూష ఆగ్ర‌హం, ఆవేద‌న‌, ఆక్రోషం క‌లిపి వ్య‌క్తం చేసినా రాహుల్ ఏమాత్రం తొణ‌క‌లేద‌ట‌.

ఈ ఫోన్ కాల్‌పై ముంబై మిర్రర్ స్పందిస్తూ.. ప్ర‌త్యూష చేత వ్య‌భిచారం చేయించాల‌ని రాహుల్ య‌త్నించాడ‌ని స్ప‌ష్టం అవుతోందని తెలిపింది.ఈ క‌థ‌నంపై రాహుల్ స‌న్నిహితులు బిన్నంగా స్పందిస్తున్నారు. రాహుల్ కూడా త‌ప్పు త‌న‌ది కాద‌ని.. మొత్తం ప్ర‌త్యూష బెన‌ర్జీ త‌ల్లిదండ్రులే చేశార‌ని ఆరోపించాడు. అయితే, ఫోన్ కాల్స్ ఆధారంగా ప్ర‌త్యూష మ‌ర‌ణం వెనుక రాహుల్ హ‌స్తం క్లియ‌ర్‌గా ఉంద‌ని అర్ధం అవుతోంది. అత‌ను పెట్టిన మాన‌సిక క్షోభ ప‌డ‌లేకే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌నే ఆరోప‌ణ‌లకి బ‌లం చేకూరుతోంది. మ‌రి, ఈ కేసు ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Loading...

Leave a Reply

*