దారుణం.. క‌బ‌డ్డీ వ‌ర‌ల్డ్ క‌ప్‌ గెలిచినందుకు ఒక్కో ప్లేయ‌ర్‌కి వ‌చ్చింది.. రూ.67 వేలు..!

kabbadi

ఇంత‌కంటే దారుణం.. చెప్పుకోలేని విష‌యం మ‌రొక‌టి ఉంటుందా..? అది ఏ గేమ్ అయినా కావొచ్చు.. ప్ర‌పంచ‌క‌ప్ గెలిచారంటే.. ఆ టీమ్ ప్లేయ‌ర్స్‌కి కాసుల పంట పండుతుంది. ఒక్కో ఆట‌గాడికి భారీ ఎత్తున న‌జ‌రానాలు వ‌స్తాయి. లెక్క‌పెట్ట‌లేనంత‌గా గిఫ్ట్‌లు, బ‌హుమతుల‌తోపాటు రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాల నుంచి కానుక‌లు వెల్లువెత్తుతాయి. కానీ, ఇటీవ‌ల ప్ర‌పంచ్ కప్ గెలిచిన క‌బ‌డ్డీ ప్లేయ‌ర్స్‌కి మాత్రం ద‌క్కింది కేవ‌లం 10 ల‌క్ష‌ల రూపాయ‌ల ప్రైజ్‌మనీ. అది కూడా పంచుకుంటే.. ఒక్కో ఆట‌గాడికి వ‌చ్చింది 67వేల రూపాయ‌లు.. అంటే అది ఎంత త‌క్కువో మీరే ఆలోచించండి..

మ‌రోవైపు, క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌లు.. ప్ర‌పంచ క‌ప్ గెలిచిన సంబరాల‌లో ఉంటే.. వారి ఆనందాన్ని పంచుకోవ‌డానికి ఏ ప్ర‌భుత్వం కూడా ముందుకు రాక‌పోవ‌డం వారికి బాధ క‌లిగించింద‌ట‌. అటు కేంద్ర ప్ర‌భుత్వం కానీ, ఇటు ఏ ఒక్క రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా వారికి న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం విశేషం. ఇత‌ర ఆట‌లలో గెలిచిన వారికి బీఎమ్‌డ‌బ్య్లూ కార్‌లు ఇచ్చేవాళ్లు లేరు. ఊరేగించే వారు కూడా లేరు.

రియో ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ సాధించిన పీవీ సింధుకు న‌జ‌రానాల పంట పండింది. ఏకంగా 13 కోట్ల రూపాయ‌లు ఇచ్చారు. ఇక‌, 2011లో ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన ఇండియా టీమ్‌లోని ఒక్కో ప్లేయ‌ర్‌కి 1.3 కోట్ల రూపాయ‌లు ద‌క్కాయి. మ‌రి, క‌బడ్డీ ప్లేయ‌ర్‌ల‌పై ఈ విచ‌క్ష‌ణ ఏంట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. అందుకే, క‌బ‌డ్డీ వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించ‌డంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ అజ‌య్ ఠాకూర్‌.. దీనిపై విచారం వ్య‌క్తం చేశాడు. గిఫ్ట్‌లు, న‌జ‌రానాలు అవ‌స‌రం లేదు.. ప్ర‌స్తుతం ఇండియాలో ప్లేయ‌ర్‌లంతా సాధార‌ణ మైదానాల్లోనే ఆడుతున్నార‌ట‌. కనీసం ట‌ర్ఫ్‌ల‌పై ఆడే సౌక‌ర్యం క‌ల్పిస్తే చాలు.. అదే ప‌దిలేలు అంటున్నారు. మ‌రి, ప్ర‌భుత్వాల‌కి ఈ మాట అయినా వినిపిస్తుందా….?

Loading...

Leave a Reply

*