ధోనీ జీవితంలో అత్యంత‌ విషాదక‌ర ఘ‌ట‌న‌… కోలుకోవ‌డానికే రెండేళ్లు ప‌ట్టింది…!

dhoni

ధోని.. భార‌త క్రికెట్‌లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. స్టార్ క్రికెట‌ర్ మాత్ర‌మే కాదు. లెజెండ‌రీ కెప్టెన్‌. భార‌త్ క్రికెట్ గ‌మనాన్ని శాసించిన అతికొద్ది మంది క్రికెట‌ర్‌లో ధోని ఒక‌డు. నిన్న‌మొన్న‌టిదాకా స‌చిన్ కంటే ఎక్కువ పాపులారిటీ, యాడ్ మార్కెట్ ద‌క్కించుకున్న క్రికెట‌ర్‌. అయితే, ఆయ‌న జీవితగాథ ఆధారంగా ఎమ్ఎస్ ధోని అనే సినిమా తెర‌కెక్కింది. ఈ వీకెండ్‌న విడుద‌ల‌కు రెడీగా ఉంది ఈ చిత్రం. బాలీవుడ్‌లో రూపొందిన ఈ సినిమా తెలుగు, త‌మిళ్ వెర్ష‌న్స్ కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. భార‌త క్రికెట్ టీ-20, వ‌న్ డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌ను అందించిన ఘ‌న‌త ధోనిది. శ్రీలంక‌పై వైజాగ్‌లో చారిత్ర‌క ఇన్నింగ్స్ మొద‌లు.. నిన్న‌టి వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యం దాకా ధోని జీవితం ఓపెన్ బుక్. క్రికెట‌ర్‌గా ధోనీ జీవితం తెరిచిన పుస్త‌క‌మే అయినా… గ్రౌండ్ వెలుప‌ల ఆయ‌న జీవితంలో ఎన్నో ఆస‌క్తిక‌ర మ‌లుపులు ఉన్నాయి.

ఆనందాల‌తో పాటు మ‌రిచిపోలేని విషాదాలు కూడా ఉన్నాయి. ధోని సినిమా కోసం ఆయ‌న వాటిని బ‌య‌ట‌పెట్టాడు. ఈ సినిమాలో ధోని వ్య‌క్తిగ‌త  జీవితంపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. క్రికెట‌ర్‌గా రాంచీలో ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో ప్రియాంక ఝా అనే అమ్మాయితో ల‌వ్‌లో ప‌డ్డాడు. ధోని క్రికెట‌ర్‌గా స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌మ‌యంలో ఆమె మాన‌సికంగా ఎంతో బలాన్ని, ఆత్మ‌స్తైర్యాన్ని ఇచ్చిందట. దీంతో,ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. ఇటు ఇంటిద‌గ్గ పెద్ద‌లు కూడా ఈ మ్యారేజ్‌కి ఓకే అన్నారట. అనుకోని ప‌రిస్థితులలో ప్రియాంక మ‌ర‌ణించింది. అప్పుడు ధోని ఇండియా ఏ టీమ్‌కి ఆడుతున్నాడు.

ఈ వార్త ధోనిని బాగా కుంగ‌దీసింద‌ట‌. కోలుకోవ‌డానికే దాదాపు రెండేళ్లు ప‌ట్టింద‌ట‌. ధోని అన్ టోల్డ్ స్టోరీలో.. ఈ సీన్ బాగా వ‌చ్చింద‌ట‌. పెళ్ల‌యినా.. ఆ జ్ఙాప‌కాల‌ను త‌న సినిమా కోసం ఓపెన్‌గా ధోనీనే చెప్పాడ‌ట‌. ఇలాంటి ఎమోష‌న‌ల్ సన్నివేశాలపైనే ఎక్కువ ఫోక‌స్ పెట్టారు ద‌ర్శ‌క‌నిర్మాతలు. ధోని మూవీని అమితాబ్‌, ర‌జ‌నీకాంత్, రాజ‌మౌళి వంటి దిగ్గ‌జాలు ప్ర‌మోట్ చేస్తున్నారు. త‌న జీవిత‌గాథ‌పై తీసిన సినిమాకోసం హీరో, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల కంటే ధోనినే ఎక్కువ‌గా ప్ర‌మోట్  చేసుకుంటూ ఉండడం విశేషం.

 

Loading...

Leave a Reply

*