ఇండియా క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌రిచిపోలేని రోజు ఇది..!

india-1

ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ టీమ్ 500వ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. మొద‌టి రెండు రోజులు కాస్త త‌డ‌బడింది. దీంతో, ఆతిధ్య న్యూజిలాండ్ జ‌ట్టుదే అప్ప‌ర్ హ్యాండ్ అని భావించారంతా. కానీ, 29 బంతుల్లోనే 5 వికెట్లు ప‌డ‌గొట్టి మ‌ళ్లీ జూలు విదిల్చింది టీమ్ ఇండియా. మ‌ళ్లీ రేస్‌లోకి వచ్చింది. ఇదంతా ఈ రోజు మ‌హిమ అంటున్నారు కొంద‌రు.సెప్టెంబ‌ర్ 24కి, టీమ్ ఇండియాకి మ‌రిచిపోలేని అనుబంధం ఉంది. అదేంటంటారా..? స‌రిగ్గా 9 ఏళ్ల క్రితం ఈ రోజు నుంచే భార‌త క్రికెట్ సువ‌ర్ణాధ్యాయం మొద‌ల‌యింది. 2007, సెప్టెంబ‌ర్ 24న టీమిండియా టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ని గెలుచుకుంది. అండ‌ర్‌డాగ్‌గా బ‌రిలో దిగిన ధోనీ సేన‌.. ఫైన‌ల్‌లో పాక్‌ని చిత్తుచేసి విజేత‌గా నిలిచింది. టీ 20 క‌ప్‌తో భార‌త్‌కి తిరిగొచ్చింది. అంత‌కు ప‌దిరోజుల ముందు విండీస్ టూర్‌ని అత్యంత పేల‌వంగా ముగించిన ఇండియా…

ఏకంగా ప‌ది రోజుల గ్యాప్‌లోనే ఓ మెగా టోర్నీని గెల‌వ‌డం ఎంతో బూస్ట‌ప్‌ని ఇచ్చింది. కెప్టెన్‌గా ధోనీకి ఇది తొలి సిరీస్‌. త‌న వ్యూహ‌చ‌తుర‌త‌తో స‌చిన్‌, గంగూలీ, ద్ర‌విడ్ వంటి సీనియ‌ర్‌లెవ‌రూ లేకుండా టీమిండియా తొలి టీ20 వ‌రల్డ్ క‌ప్‌ని ద‌క్కించుకుంది.దీని త‌ర్వాత భార‌త్ క్రికెట్ ప్ర‌స్థానం కొత్త మ‌లుపు తిరిగింది. ధోనికి కెప్టెన్సీ ప‌గ్గాలు వచ్చాయి. ఆ త‌ర్వాత వ‌న్డేల‌లో భార‌త్ యువ క్రికెట‌ర్ల‌తో రాటుదేలింది. 2011లో విశ్వ విజేత‌గా నిలిచింది. ఇక‌, అదే ఇయ‌ర్‌లో భార‌త్ టెస్ట్‌ల‌లోనూ నెంబ‌ర్ వ‌న్ టీమ్‌గా ర్యాంక్‌ను పొందింది. ఇలా, ఎన్నో విజ‌యాలు ద‌క్కాయి. పొట్టి క్రికెట్‌లో తొలి విశ్వ విజేత‌గా నిలిచిన టీమ్ ఇండియా దూకుడు చూసి.. వెంట‌నే బీసీసీఐ ఐపీఎల్ సిరీస్‌ని స్టార్ట్ చేసింది. అది ఎంత స‌క్సెస్ అయిందో స్పెష‌ల్‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. మొత్త‌మ్మీద‌, భారత క్రికెట్‌కు సెప్టెంబ‌ర్ 24 ఓ మ‌రిచిపోలేని రోజు.

Loading...

Leave a Reply

*