రెండో పెళ్లికి మాజీ ముఖ్య‌మంత్రి భార్య రెడీ…. కొత్త ప్రియుడుతో ఫోటోలు నెట్‌లో హ‌ల్‌చ‌ల్‌..!

untitled-2021

రాధికా కుమార‌స్వామి గౌడ‌… అదేనండీ.. క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి గౌడ భార్య‌. ఆమెపై క‌న్న‌డనాట సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. ఒక‌ప్ప‌టి సినీ న‌టి, నేటి కుమార‌స్వామి భార్య‌… త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు విడాకులు ఇవ్వ‌బోతోందంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమ‌ర్‌లు షికారు చేస్తున్నాయి. అక్క‌డితో ఆగ‌డం లేదు. మంగ‌ళూరు బిజినెస్‌మేన్ వివేక్ రాయ్‌తో దిగిన ఫోటోల‌ను నెట్‌లో పెట్టి.. త్వ‌ర‌లోనే ఆయ‌న‌తో మ్యారేజ్ కాబోతోందంటూ వ‌దంతులు క్రియేట్ అవుతున్నాయి. క‌న్న‌డ‌నాట ఇది ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఒక‌ప్ప‌టి అందాల భామ‌, ప్రెజెంట్ మాజీ ముఖ్య‌మంత్రి భార్య రాధిక‌.. ఇలా ఆయ‌న‌కు హ్యాండ్ ఇస్తోందనే ప్ర‌చారం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. అంతేకాదు, వివేక్ రాయ్‌తో దిగిన ఫోటోలు కూడా వైర‌ల్‌గా మారాయి.

అంతేకాదు, రేపో మాపో కుమార స్వామికి విడాకులు ఇచ్చి.. త్వ‌ర‌లోనే రెండో మ్యారేజ్‌కి రెడీ అంటూ కూడా షేర్ చేస్తున్నారు కొంద‌రు. దీంతో… ఇది పెను దుమారంగా మారింది.మ‌రోవైపు, ఈ వార్త‌ల‌పై రాధిక కుమార‌స్వామి మండిప‌డుతున్నారు. ఇదంతా కేవ‌లం త‌నను బ‌ద్నాం చెయ్య‌డానికే కుట్ర జ‌రుగుతోంద‌ని ఆమె ఖండిస్తున్నారు. వివేక్ రాయ్‌తో కేవ‌లం బిజినెస్ చెయ్య‌డానికే తాను ఈ ఫోటోలు దిగాన‌ని, అంత‌కుమించి త‌న‌కు వేరే రిలేష‌న్ లేద‌ని చెబుతున్నారు. ఓ అగ్రిక‌ల్చ‌ర్ బిజినెస్‌కి సంబంధించిన వ్యాపారం కోసం త‌ర‌చూ క‌లుస్తున్నామ‌ని, అంతేత‌ప్ప‌.. కుమార స్వామికి డైవోర్స్ ఇస్తున్నాన‌డం అబ‌ద్ధ‌మ‌ని వివ‌రించారు.

కుమార‌స్వామి రాజ‌కీయాల‌లోకి రాక‌ముందు క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో డిస్ట్రిబ్యూట‌ర్‌గా ప‌నిచేశారు. ఆ ప‌రిచ‌యంతోనే రాధిక‌ను వివాహం చేసుకున్నారు. ఆయ‌న‌కు ఇది రెండో మ్యారేజ్‌. ఈ ఇద్ద‌రికీ రెండేళ్ల క్రితం పాప పుట్టింది. త‌న మొద‌టి భార్య కుమారుడు నిఖిల్‌ని హీరోగా పెట్టి జాగ్వార్ సినిమాని నిర్మించాడు కుమార స్వామి. ఈ సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయింది. అయితే, త‌న రెండో మ్యారేజ్‌పై వ‌స్తున్న పుకార్ల‌కు సంబంధించి ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.ఈ మేట‌ర్ ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో అని పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేస్తున్నారు. మ‌రి, ఈ ఎపిసోడ్ చివ‌రికి ఎలాంటి ట్విస్ట్ తీసుకుంటుందో చూడాలి.

Loading...

Leave a Reply

*