చైతూ, స‌మంత ప్రేమ‌మ్ డ్యాన్స్‌

samantha-happy-dance-with-premam-success

చైతూ, స‌మంత పీక‌ల దాకా ప్రేమ‌లో మునిగితేలుతున్నారు… ఇప్పుడు పెళ్లి కూడా త్వ‌ర‌లో కుద‌ర‌నుంది…… పెద్ద‌లు ఓకే అన్నారు… దీంతో ఈ కుర్ర‌జంట తెగ‌రెచ్చిపోతోంది.. ప్రేమ‌మైకంలో మైమ‌రిచిపోతోంది…. దానికితోడు చైతూ న‌టించిన ప్రేమ‌మ్ సూప‌ర్ స‌క్సెస్ కావ‌డంతో… ప్రేమ‌లో ప‌డ్డ ఈ జంట ధూంధాం చేస్తోంది… ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటున్నారు…. ప్రైవేట్ పార్టీల‌కు వెళ్లి డ్యాన్సుల‌తో దుమ్ము దులుపు తున్నారు… చెట్టాప‌ట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ జంట ఆట‌పాట‌ల‌తో కాలం గ‌డుపుతోంది….

త‌న ప్రియుడు న‌టించిన ప్రేమ‌మ్ సూప‌ర్‌హిట్ కావ‌డంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం ఫుల్ హ్యాపీగా ఉంది… కాబోయే భ‌ర్త న‌టించి ప్రేమ‌మ్ చిత్రం ఘ‌నవిజ‌యం సొంతం చేసుకోవ‌డంతో ఆమె ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి….రిలీజ్ రోజునే ట్విట్ట‌ర్‌లో త‌న‌కు ఎగ‌రాలో, ఏడ‌వాలో, న‌వ్వాలో తెలియ‌డం లేద‌ని అంటూ ఆనందంగా చెప్పిన స‌మంత తాజాగా నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఓ ప్రైవేట్ పార్టీలో తెగ ఎంజాయ్ చేసింది…. చిన్న‌పిల్ల‌లా సంతోషంతో ఎగిరి గంతులు వేసింది…దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది… ఇది ఇప్పుడు వైర‌ల్‌గా మారింది…

ఇందులో స‌మంత‌ ఫుల్‌జోష్‌తో మ్యూజిక్‌కు డ్యాన్సులు చేస్తుంటే నాగ‌చైత‌న్య ఆమెను చూస్తూ అప్పుడ‌ప్పుడు చిన్న స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశాడు…. స‌మంత మాత్రం ప‌ట్ట‌రాని ఆనందంతో అలిసిపోయే దాకా డ్యాన్స్‌చేసి కాస్త నీళ్లు తాగి మ‌ళ్లీ డ్యాన్స్ చేస్తూ మ‌ధ్య‌మ‌ధ్య‌లో చైతూతో ముచ్చ‌ట్లు చెబుతూ ఫుల్‌గా ఎంజాయ్ చేసింది… కాబోయే శ్రీమ‌తి స‌మంత త‌న స‌క్సెస్‌కి అంత జోష్‌గా డ్యాన్స్ చేసేస‌రికి చైతూ ఆమెకు ఫిదా అయిపోయాడు…. ఇప్పుడు ఇద్ద‌రు క‌లిసి ఇలా ప్రేమ‌గా ప్రేమ‌మ్ డ్యాన్సులు చేస్తూ జోరుగా హుషారుగా ముందుకు సాగుతున్నారు.

 

Loading...

Leave a Reply

*