ఫిట్‌నెస్ కోసం ఎన్ని వంద‌ల కి.మీ.. ర‌న్నింగ్ చేశాడంటే..?

untitled-3-copy

స‌చిన్ టెండూల్క‌ర్‌…. ఇండియ‌న్ క్రికెట్ గాడ్‌.. క్రికెట్ నుంచి రిటైరైపోయినా ఆయ‌న‌కు జ‌నంలో క్రేజ్ త‌గ్గ‌లేదు…. క్రికెట్ ఆడిన‌న్నాళ్లు టెండూ ల్క‌ర్ త‌న ఫిట్‌నెస్‌ని కాపాడుకున్నాడు… ట‌న్నులు ట‌న్నులు ర‌న్నులు సాధించిన స‌చిన్ వికెట్ల మ‌ధ్య అత్యంత వేగంగా ప‌రిగెత్తేవాడు…. అయితే స‌చిన్‌కి ఇంత ఫిట్‌నెస్ ఎలా వ‌చ్చిందో తెలుసా… ఆయ‌న ఫిట్‌గా ఉండ‌డానికి 353 కిలోమీట‌ర్లు ప‌రిగెత్తాట్ట‌…. ఏంటి ఫిట్‌నెస్ కోసం స‌చిన్ ఇంతదూరం ప‌రిగెత్తేవాడా అని ఆశ్చ‌ర్య‌పోయి అవాక్క‌వ‌బాకండి…. అంత‌కంటే ఎక్కువ దూర‌మే ప‌రిగెత్తాడు… ఒక్క‌మ‌నిషి ఇన్ని కిలోమీట‌ర్లు ప‌రిగెత్త‌డం సాధ్య‌మ‌య్యే ప‌నేనా అని తెగ ఆశ్చ‌ర్య‌పోకండి… ఇది ఒక్క రోజులో జ‌రిగింది కాదు… ఏళ్ల త‌ర‌బ‌డి చేసిన ప‌రుగులు అవి…. క్రికెట్‌ని రారాజుగా ఏలిన‌న్నాళ్లు స‌చిన్ త‌న ఫిట్‌నెస్‌ను ర‌న్నింగ్ ద్వారా కాపాడుకున్నాట్ట‌..

ఆ విష‌యాన్ని తాజాగా ఆయ‌నే వెల్ల‌డించాడు… స‌చిన్ క్రికెట్ ఆడే రోజుల‌ను బాగా గుర్తుకు తెచ్చుకోండి.. వ‌న్డే అయినా టెస్ట్‌మ్యాచ్ అయినా స‌చిన్ వికెట్ల మ‌ధ్య అత్యంత వేగంగా ప‌రిగెత్తేవాడు… ఇండియ‌న్ టీమ్‌లో అత‌నికంటే వేగంగా ప‌రిగెత్తేవాళ్లే లేరు… అలా వికెట్ల మ‌ధ్య అత్యంత వేగంగా ర‌న్స్ తీయ‌డం స‌చిన్ ఫిట్‌నెస్‌ని కాపాడిందిట‌.. ఈ విష‌యాన్ని క్రికెట్ గాడ్ స్వ‌యంగా చెప్పాడు… వికెట్ల మ‌ధ్య వేగంగా ప‌రుగులు తీయ‌డంతో స‌చిన్ అదిరిపోయే ఫిట్‌నెస్ సాధించాడు… అత్యంత ఫిట్‌గా ఉండేవాళ్ల కంటే స‌చిన్ ఫిట్‌గా ఉండేవాడు… అంత ఫిట్‌గా ఉండ‌బ‌ట్టే తాను క్రికెట్‌లో హిట్ అయ్యానంటున్నాడు స‌చిన్‌…వ‌న్డేలైనా, టెస్టు మ్యాచ్‌లైనా త‌న 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో వికెట్ల మ‌ధ్య ప‌రుగుల కోసం తాను 353 కిలోమీట‌ర్లు ప‌రిగెత్తాన‌ని స‌చిన్ చెబుతున్నాడు. సో రన్నింగ్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ స‌చిన్ అన్న‌మాట‌.

Loading...

Leave a Reply

*