నిమ్మ‌గ‌డ్డ‌, చిరు, నాగ్‌ల‌తో స‌చిన్ తెగ‌తెంపులు

nag

ఎక్క‌డో తీగ లాగితే మ‌రెక్క‌డో డొంక క‌దులుతోంది… వేల కోట్ల బ్లాక్‌మ‌నీ కుంభ‌కోణానికి సంబంధించి బ‌హ‌మాస్ పేప‌ర్స్ లీక్ అయితే తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోతున్నాయి.. సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు వీక్ అయిపోతున్నారు… బ‌హ‌మాస్ పేప‌ర్ల‌లో నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ పేరు రావ‌డంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిప‌డ్డాయి… జ‌న‌మే కాదు సెల‌బ్రిటీలు కూడా క‌ల‌వ‌ర‌ప‌డిపోతున్నారు… నిమ్మ‌గ‌డ్డ‌తో బిజినెస్ లింక్స్ ఉన్న నాగార్జున‌, చిరంజీవి ఖంగు తిన్నారుట‌… వీళ్ల పేర్లు కూడా బ‌హమాస్ పేప‌ర్ల‌లో ఉండే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు భావిస్తుండ‌డంతో నాగ్‌, చిరు ఉలిక్కిప‌డుతున్నారుట‌….

అయితే వీళ్ల‌లాగే మ‌రో వ్య‌క్తి కూడా ఉలిక్కిప‌డ్డాడుట‌…. అత‌నే ఇండియ‌న్ క్రికెట్ లెజెండ్‌… క్రికెట్‌గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్‌… నిమ్మ‌గ‌డ్డ‌, చిరు, నాగ్‌… ఈ త్రిమూర్తుల త్ర‌యంతో ఇటీవ‌లే స‌చిన్ చేతులు క‌లిపాడు… ఈ ముగ్గురితో క‌లిసి వ్యాపార‌బంధం పెన‌వేసుకున్నాడు టెండూల్క‌ర్‌….. నిమ్మ‌గ‌డ్డ‌, చిరు,నాగ్, స‌చిన్ క‌లిసి కేర‌ళ ఫుట్‌బాల్ జ‌ట్టును కొనుగోలు చేశారు… ఐపీఎల్ లాగే ఫుట్‌బాల్ లీగ్‌లోకి కేరళ టీమ్‌తో వీళ్లు అడుగు పెడుతున్నారు…. అయితే ఆదిలోనే హంసపాదు అన్న‌ట్టు బ‌హ‌మాస్ పేప‌ర్స్ లీక్‌లో నిమ్మ‌గ‌డ్డ పేరు వినిపించ‌డం….

చిరు, నాగ్ షేక్ కావ‌డం గ‌మ‌నించిన స‌చిన్ వీళ్ల‌తో బ్రేక్ చేసుకుంటే మంచిద‌ని భావిస్తున్నాట్ట‌… వేల కోట్ల బ్లాక్‌మ‌నీ కుంభ‌కోణాలు, అల్లిబిల్లి కంపెనీల మాయాజాలం చూసి స‌చిన్ ఖంగు తిన్నాట్ట‌… ఈ ముగ్గురు మాయల మరాఠీల్లా ఉన్నారు… వీళ్ల‌తో వ్యాపారం బంధం త‌న కొంప ముంచుతుందేమో అని స‌చిన్ బెంబేలెత్తుతున్నాట్ట‌…. వీళ్లకు సాధ్య‌మైనంత దూరంగా ఉంటేనే మంచిద‌నే నిర్ణ‌యానికి స‌చిన్ వ‌చ్చాట్ట‌… ఈ నేప‌థ్యంలో నిమ్మ‌గ‌డ్డ‌, చిరు, నాగ్‌ల‌తో వ్యాపార బంధాన్ని తెగ‌తెంపులు చేసుకోవ‌డానికి స‌చిన్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని స‌మాచారం.

Loading...

Leave a Reply

*