సోష‌ల్ మీడియాలో రోజా సూప‌ర్‌హిట్‌!

roja

ఎప్పుడూ వివాద‌స్ప వ‌ష‌యాల‌లో అంద‌రి నోళ్ల‌లో నానే రోజాపై ఇప్పుడు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఒక్క‌రోజులోనే ఆమె సోష‌ల్ మీడియాలో హీరోయిన్ అయిపోయారు. ఇందుకు మాన‌వ‌త్వంతో ఆమె చేసిన సాయ‌మే కార‌ణమైంది. చిత్తూరు జిల్లాలోని ముత్త‌ర‌ప‌ల్లెకు చెందిన సింధూ(25) చిత్తూరు నుంచి తిరుప‌తికి త‌న స్కూటీపై బ‌య‌ల్దేరింర‌ది. మార్గ‌మ‌ధ్య‌లో సింధూ బండిని గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొట్టి వెళ్లిపోయింది. రోడ్డుప‌క్క‌న తీవ్ర‌గాయాల‌తో ప‌డి ఉన్న సింధూను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అదే స‌మ‌యంలో అటుగా వెళ్తున్న న‌గ‌రి ఎమ్మెల్యే రోజా… సింధూని గ‌మ‌నించారు. త‌క్ష‌ణం త‌న కారును ఆపి వెంట‌నే ఆమెను వాహ‌నంలో ఎక్కించుకుని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

హుటాహుటిన వైద్య‌సేవ‌లు అందించడంతో సింధూకు ప్రాణాపాయం త‌ప్పింది. ఆ త‌ర్వాత మెరుగైన‌వ వైద్యం కోసం ఆ యువ‌తిని స్విమ్స్‌కు త‌ర‌లించారు. ఇదే విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. రోజాపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. నేండ్ర‌గుంట చిత్తూరు మార్గంలో 27 కిలోమీట‌ర్ల వ‌ర‌కూ ఎక్క‌డా ఆస్ప‌త్రులు లేవ‌ని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో జ‌నం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ప్రాణాలు పోగొట్టుకుంటున్నార‌ని రోజా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం దీనిపై స్పందించి వైద్య సేవ‌ల‌ను ఈ ప్రాంతంలో అందుబాటులోకి తేవాల‌ని ఆమె కోరారు.

Loading...

Leave a Reply

*