ఈ వీడియో చూసి న‌వ్వుకున్న కోటిన్న‌ర మంది ఆమెకు సారీ చెప్పాలి….!

prema

ముందు ఈ వీడియో చూడండి.. చూశారా..? చూసిన త‌ర్వాత మ‌న‌కు అనిపించేది ఒక్క‌టే.. ఆమె ఎంత ఫాస్ట్‌గా క్యాష్ లెక్కిస్తుందో అని. ఆ త‌ర్వాత న‌వ్వు వ‌స్తుంది. ఆ వెంట‌నే మ‌న చేతులు కీ బోర్డ్ మీద‌కు వెళ‌తాయి. ఫాస్టెస్ట్ క్యాషియ‌ర్ అని. ఇలా, చాలామంది ఈ వీడియోని చూసి న‌వ్వుకున్నార‌ట‌. ఇంత స్లోగా మ‌నీ కౌంట్ చేస్తుంద‌ని తిట్టుకుంటాం.. అందుకే, దాదాపు 2 ల‌క్ష‌ల మంది ఈ వీడియోని చూసి కామెంట్స్ కూడా పెట్టారు. కానీ, ఆమె ప‌రిస్థితి చూస్తే మ‌నం కూడా సిగ్గు ప‌డ‌తాం.. ఆమెకు సారీ కూడా చెబుతాం.. ఇలా న‌వ్వుకున్న దాదాపు కోటిన్న‌ర మంది ఆమెకు సారీ చెప్పాల్సిన సిచ్యువేష‌న్‌.. న‌మ్మ‌లేక‌పోతున్నారా..? అయితే స్టోరీ చ‌ద‌వండి.

ఈమె పేరు ప్రేమల‌త‌. పూణేలోని బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌లో క్యాషియ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఇటీవ‌ల ఆమె ఆరోగ్య ప‌రిస్థితి అంతా బాగోలేదు. రెండు సార్లు గుండె నొప్పి కూడా వ‌చ్చింది. ఒక‌సారి తీవ్రమ‌యిన హార్ట్ ఎటాక్‌తో ఆమెకి ప‌క్ష‌వాతం కూడా వ‌చ్చింది. దీంతో, కొన్నాళ్లు విధుల‌కు దూరంగా ఉంది. త‌ర్వాత తిరిగి ఆఫీస్‌లో జాయిన్ అయ్యారు ప్రేమ‌ల‌త‌. అప్పుడు తీసిన వీడియో ఇది. విధుల్లో జాయిన్ తొలినాళ్ల‌లో ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే, చాలా స్లోగా మ‌నీ కౌంట్ చేస్తోంది. ఆమెకు బోలెడు సెల‌వులు ఉన్నాయి. ఆఫీస్‌లో చాలా సిన్సియ‌ర్ అట‌.విధుల‌కు దూరంగా ఉండ‌డం ఇష్టం లేక‌, సెల‌వులు ఉన్నా ఆషీస్‌కి వ‌చ్చి నిబ‌ద్ద‌త‌తో వ‌ర్క్ చేస్తున్నారు ప్రేమ‌ల‌త‌.

2017 ఫిబ్ర‌వ‌రిలో ఆమె రిటైర్ అవుతున్నారు. అప్ప‌టిదాకా ఆమె సెల‌వులు పెట్టుకునే చాన్స్ ఉన్నా.. ఆఫీస్‌కి వ‌చ్చి విధులు నిర్వ‌ర్తించేందుకే ఇష్ట‌ప‌డుతున్నారు. చివ‌రి కొన్ని రోజులు వ‌ర్క్ చేసి రిటైర్ అవ్వాల‌నేది ఆమె అభిలాష అట‌. అందుకే, ఇలా చేస్తున్నార‌ని… చెబుతున్నారు. అంతేకాదు, ఆమె త‌న‌యుడు యూఎస్‌లో సాఫ్ట్ వేర్ ఎంప్లాయిగా స్థిర‌ప‌డ్డార‌ట‌. అయినా, ఆమె వ‌ర్క్ చెయ్య‌డానికే మొగ్గు చూపార‌ట‌. అందుకే, అస‌లు విష‌యం తెలిసిన చాలా మంది ఆమెకు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నారు. అందుకే, వాస్తవాలను తెలుసుకోకుండా, ఎదుటి వ్యక్తుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఫన్నీ కామెంట్స్ చేయడం, సెటైర్లు వేయడం సోషల్ మీడియా యూజర్లకు తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Loading...

Leave a Reply

*