జియో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌.. 15 నెల‌లు ఫ్రీ.. ఫ్రీ.. కండిష‌న్‌లు అప్లై..!

jio1

రిల‌య‌న్స్ జియో ఎంట్రీతో ఇప్ప‌టికే టెలికాం రంగంలో డేటా విప్ల‌వం మొద‌ల‌యింది. ఇప్ప‌టికే ఫ్రీ డేటాతో వెల్క‌మ్ ఆఫ‌ర్‌ని ప్ర‌క‌టించిన జియో.. తాజాగా మ‌రో కొత్త డేటా ఆఫ‌ర్‌ని ముందుకు తీసుకువ‌చ్చింది. 15 నెల‌లుపాటు ఉచితంగా ఆర్‌జియో స‌ర్వీసులు పొందే అవ‌కాశం క‌ల్పిస్తోంది.అయితే, ఇది కేవ‌లం కొంత‌మందికి మాత్ర‌మే. ఆ కొంద‌రు ఎవ‌ర‌నుకునుకుంటున్నారా..? యాపిల్ ఐఫోన్‌ల వినియోగదారుల‌కు మాత్ర‌మే… ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌. వీరు ఏడాదిపాటు ఉచిత వాయిస్ కాల్స్‌, 20 జీబీ డేటా, అప‌రిమిత ఎస్ఎమ్ఎస్‌ను ఉపయోగించుకోవ‌చ్చు. ఈ ప్యాకేజ్ విలువ ఎంత ఉంటుందో తెలుసా..? ఏకంగా 18వేల రూపాయ‌లు. అయితే, రిల‌య‌న్స్ జియో అందిస్తున్న స్వాగ‌త ప్లాన్ ఈ ఏడాది డిసెంబ‌ర్ 31తో ముగుస్తుంది.

కానీ, వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి ఐ ఫోన్ వినియోగ‌దారులు ఈ ఫ్రీ ప్లాన్ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని రిల‌య‌న్స్ జియో వ‌ర్గాలు వెల్ల‌డించాయి.రిల‌య‌న్స్ రిటైల్ స్టోర్ ద‌గ్గ‌ర కానీ, యాపిల్ స్టోర్ ద‌గ్గ‌ర కానీ ఐఫోన్ కొనుగోలు చేసిన క‌స్ట‌మ‌ర్ల‌కు డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు వెల‌క‌మ్ ఆఫ‌ర్ పొంద‌వ‌చ్చు. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి వీరంతా 1499 రూపాయ‌ల ప్లాన్‌ను పూర్తి ఫ్రీగా పొందే చాన్స్ ఉంటుంది. ఈ ప్లాన్ కింద ఈ క‌స్ట‌మ‌ర్‌లు 18,000 రూపాయ‌ల విలువైన స‌ర్వీసులు పొందుతారు. ఇక‌, 1,499 రూపాయ‌ల ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్‌, ఎస్‌టీడీ వాయిస్ కాల్స్‌, ఫ్రీ రోమింగ్‌, 20 జీబీ 4 జీ డేటా, రాత్రి అప‌రిమిత 4జీ డేటా, 40 జీబీ వైఫై డేటా, అన్‌లిమిటెడ్‌ ఎస్ఎమ్ఎస్‌లు, అన్‌లిమిటెడ్ జియో యాప్స్ ల‌భిస్తాయి. జియో ఇచ్చే ఆఫ‌ర్ ఐ ఫోన్ 7, 7 ప్ల‌స్ కస్ట‌మ‌ర్‌ల‌కే కాదు.. ఐ ఫోన్ 6, 6ప్ల‌స్‌, 6 ఎస్ ప్ల‌స్‌, ఎస్ఈ వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చు.

Loading...

Leave a Reply

*