జియో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ సారి వారికి మాత్ర‌మే..!

untitled-111

రిల‌య‌న్స్ జియో.. డేటాగిరి అంటూ ఇత‌ర టెలికాం కంపెనీల‌కు చుక్క‌లు చూపిస్తోంది. జియో ఎంట్రీతో ఉలిక్కిపడ్డ కంపెనీల‌న్నీ ఆఫ‌ర్‌ల బాట ప‌ట్టాయి. ఒక కంపెనీతో మ‌రో కంపెనీ పోటీప‌డి డేటా వార్ మొద‌లుపెట్టాయి. ఇదే ఊపులో జియో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. అయితే, ఇది కంపెనీలోని ఉద్యోగుల‌కు మాత్ర‌మే.ఎంప్లాయీస్‌కి భారీగా వేత‌నాల‌ను పెంచింది. జియోని కస్ట‌మ‌ర్ల‌కు రీచ్ చెయ్య‌డంలో స‌క్సెస్ అయింద‌ని ముఖేష్ అంబానీ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అందుకే, అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన ఎగ్జిక్యూటివ్‌ల జీతాల‌ను దాదాపు 15 శాతం వ‌ర‌కు పెంచింది. ఇక‌, జూనియ‌ర్‌, మిడిల్ లెవ‌ల్ మేన‌జ‌ర్లకు.. 15 శాతం వ‌ర‌కు పెంచ‌గా.. డీజీఎం ఆపై అధికారుల‌కు 10 శాతం వ‌ర‌కు జీతాలు పెంచిన‌ట్లు స‌మాచారం.

ఇక‌, నెట్‌వ‌ర్క్‌, ఐటీ స‌పోర్ట్‌, సేల్స్‌, మార్కెటింగ్‌, క‌స్ట‌మర్‌, హెచ్ఆర్ విభాగాల‌లో ప‌నిచేస్తున్న వారికి కూడా ఈ పెంపు వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది రిల‌య‌న్స్‌. ఉద్యోగుల హోదాను బట్టి జూనియర్లకు 7నుంచి 15శాతం, మధ్యశ్రేణిలో 5 నుంచి 10శాతం పెంచారు. టెలికం సెక్టార్‌లో తాము ఇచ్చిన ఇంక్రిమెంట్లు మరే కంపెనీ ఇవ్వలేదని జియో హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌ తెలిపారు.టెలికం సెక్టార్‌లో ఉన్న తీవ్రమైన పోటీ.. అత్యున్నత స్థాయి ఉద్యోగులను కాపాడుకునేందుకు కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితిని సృష్టించింది. ఇటీవల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు క్యూ కట్టి సంస్థను వీడుతుండటంతో రిలయన్స్‌ జియో దీనికి అడ్డుకట్ట వేసి ప్రతిభావంతులను కాపాడుకునేందుకు నడుంబిగించింది.

Loading...

Leave a Reply

*