మీ అకౌంట్‌లో 2.5ల‌క్ష‌ల మించి డిపాజిట్ చేశారో.. రంగు ప‌డుద్ది..!

deposite-1

బ్లాక్ మ‌నీపై ప్ర‌ధాని మోదీ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్‌తో న‌ల్ల కుబేరులు ఉలిక్కి ప‌డుతున్నారు. తమ ద‌గ్గ‌ర ఉన్న వంద‌ల కోట్ల రూపాయ‌ల మ‌నీని వైట్ చేసుకునేందుకు త‌హత‌హ లాడుతున్నారు. దీనికోసం ర‌క‌ర‌కాల రూట్‌ల‌ను ఆశ్రయిస్తున్నారు. అందుకే, చిన్న చిన్న అకౌంట్ హోల్డ‌ర్‌ల‌ను ప‌ట్టుకొని వారి బ్యాంక్ ఖాతాల‌లో లక్ష‌ల్లో డిపాజిట్‌లు చెయ్యాల‌ని తెగ ఆరాట ప‌డుతున్నారు. దీంతో, ఒక్క‌సారిగా అకౌంట్‌లు ఉన్న‌వారికి డిమాండ్ పెరిగింది.

అయితే మీ అకౌంట్‌లో ఫ్రీగా మ‌నీ ప‌డుతుంది క‌దా.. త‌ర్వాత మ‌న‌కు క‌లిసి వ‌స్తుందిలే అని చూశారో.. మీకు దిమ్మ తిరిగి బొమ్మ క‌న‌బ‌డ‌డం ఖాయం. ఇలాంటివి జ‌రుగుతాయ‌ని ముందే ఊహించిన ఆర్‌బీఐ టీమ్‌… దీని కోసం కూడా ప‌క్కా స్కెచ్ రెడీ చేసింది. ఈ నెల 10వ తారీఖు నుంచి డిసెంబ‌ర్ 30 మ‌ధ్య‌లో జ‌రిగే డిపాజిట్ల‌పై పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండాల‌ని కేంద్ర రెవెన్యూ కార్య‌ద‌ర్శి తెలిపారు. చిన్న చిన్న వ్యాపారులు, కార్మికులు చేసే డిపాజిట్‌ల‌పై ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని, కానీ ల‌క్ష‌ల్లో డిపాజిట్ చేసే వారిపై పూర్తి నిఘా ఉంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

ముఖ్యంగా 1.5 ల‌క్ష‌ల నుంచి 2.5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు అమౌంట్ ప‌న్ను ప‌రిధిలోకి రాద‌ని, అది దాటిందంటే మీ అకౌంట్‌పై డేగ క‌న్ను ప‌డ‌డం ఖాయ‌మంటున్నారు. 2.5 ల‌క్ష‌ల రూపాయలను మించి డిపాజిట్ చేయాలనుకుంటే ఆ మొత్తం ఆదాయ రిటర్న్స్‌లో గతంలో వెల్లడించిన దానికి సరిపోవాలని చెప్పారు. లేకపోతే రెండు వందల శాతం టాక్స్ పెనాల్టీ పడుతుందని రెవిన్యూ కార్యదర్శి స్పష్టం చేశారు. సో.. మీ సొంత బంధువులు బ‌తిమలాడార‌నో, వారికి సాయం చేద్దామ‌ని మీరు అడుగు ముందుకు వేశారో.. మీకు ఆ త‌ర్వాత చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయం. మీ బొమ్మ అక్క‌డే తిర‌గ‌బ‌డుతుంది. జర జాగ్ర‌త్త‌. ఈ టైమ్‌లో ఎలాంటి ఆఫ‌ర్‌లు వ‌చ్చినా కాస్త ఆలోచించి అడుగు వెయ్యండి. లేకుంటే మీరు బుక్ అవుతారు.

Loading...

Leave a Reply

*