ఈ పెళ్లి ముందు గాలి పెళ్లీ బ‌లాదూర్‌!

untitled-5-1

బెగ‌ళూరు ప్యాలెస్‌లో నాలుగు రోజుల క్రితం జ‌రిగిన గాలి కూతురి పెళ్లి గురించి దేశ‌మంతా గగ్గోలు పెట్టింది. కొన్నాళ్ల‌పాటు ఇలాంటి పెళ్లి మ‌ళ్లీ ఎక్క‌డా జ‌ర‌గ‌దేమో అనుకున్నారంతా. కానీ అదే క‌ర్ణాట‌క‌లో మ‌రో భారీ వివాహానికి తెర లేచింది. గాలి ఒకప్ప‌టి బీజేపీ నేత కాబ‌ట్టి కాంగ్రెస్ ఏకంగా పార్ల‌మెంట్‌లో ఈ భారీ హంగామా గురించి ప్ర‌స్తావించి ర‌గ‌డ సృష్టించింది. ఇప్పుడు ఆ చాన్స్ బీజేపీకి వ‌చ్చింది. బికాజ్‌… గాలిని మించిన డాబుతో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోని ఒక మంత్రి త‌న కుమారుడి పెళ్లి చేయ‌బోతున్నారు.

ఇదే క‌ర్ణాట‌క‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి ర‌మేశ్ జ‌ర్కిహోలీ త‌న కుమారుడు సంతోష్ పెళ్లిని అంగ‌రంగ‌వైభ‌వంగా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గోక‌క్ ప‌ట్ణణంలో జ‌రిగ‌నున్న ఈ పెళ్లి కోసం వేదిక‌నే రెండున్న‌ర ఎక‌రాల‌లో ఏర్పాటు చేస్తున్నారు. వ‌చ్చే ఆదివారం జ‌రిగే ఈ పెళ్లి కోసం గోక‌క్ ప‌ట్ట‌ణ‌మంతా ముస్త‌బ‌వుతోంది. ఊరు ఊరంతా పెళ్లి కుమారుడి బ్యాన‌ర్లు, క‌టౌట్‌లు ఏర్పాటు చేశారు. ల‌క్ష మందికి పైగా ఆహుతులు ఈ పెళ్లికి హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా. పెళ్లి మండ‌ప‌మంతా ఎయిర్‌కండీష‌న్లు, వ‌చ్చే అతిథుల కోసం హెలికాప్ట‌ర్లు.. అవి దిగేందుకు ప‌ట్ట‌ణ శివార్ల‌లో హెలీప్యాడ్‌లు….

అక్క‌డి వీవీఐపీల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌త్యేక వాహ‌నాలు ఇలా ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌తో ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి వేదిక‌ను కొల్హాపూర్‌లోని మ‌హాల‌క్ష్మి ఆల‌య న‌మూనాతో రూపొందించ‌డం మ‌రో ప్ర‌త్యేక‌త‌. ఈ పెళ్లికి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి స‌హా ప‌ల‌వురు కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు కూడా ఈ పెళ్లికి వ‌స్తార‌ని స‌మాచారం. గాలి పెళ్లి ఖ‌ర్చు వంద‌ల కోట్లంటూ బీజేపీని పార్ల‌మెంట్‌లో ఇరుకున పెట్టిన కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు త‌మ మంత్రి చేస్తున్న పెళ్లిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Loading...

Leave a Reply

*