ఆ ఎమ్మెల్యే బాబును త‌ల‌దించుకునేలా చేశారు!

bau

మొత్తానికి నెల్లూరు జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే చంద్ర‌బాబుకు త‌ల‌వంపులు తెచ్చిపెట్టారు. స‌ద‌రు ఎమ్మెల్యే వ‌సూళ్ల ప‌ర్వంపై మీడియా గ‌గ్గొలు పెట్ట‌డంతో చంద్ర‌బాబు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయారు. దాంతో పార్టీ నేత‌ల‌ను పిలిచి త‌క్ష‌ణం ఆ ఎమ్మెల్యే సంగతేందో క‌నుక్కోమ‌ని పుర‌మాయించార‌ట‌. అత‌డిని తీసుకొచ్చి త‌న ముందు హాజ‌రుప‌ర‌చాల‌ని కూడా చెప్పార‌ట‌. ఆ ఎమ్మెల్యే పేరే కె రామ‌కృష్ణ‌. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం. గ‌తంలోనూ అనేక‌సార్లు ఈయ‌న‌కు చంద్ర‌బాబు వార్నింగ్ ఇచ్చారు. అయినా బుద్ధి మార్చుకోని స‌ద‌రు ఎమ్మెల్యే త‌న దందాలు కొన‌సాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఒక కాంట్రాక్ట‌ర్‌ను డ‌బ్బుల కోసం బెదిరించ‌డం.. ఇవ్వ‌కుంటే ప‌నులు ఎలా చేస్తావో చూస్తానంటూ హెచ్చ‌రించ‌డం ర‌చ్చ ర‌చ్చ అయ్యింది.

దొరికిందే చాన్సంటూ ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన మీడియా ఎల్లో టాక్స్ కోసం ఎమ్మెల్యే బెదిరింపులంటూ క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌కు న‌ష్టం త‌ప్ప‌ద‌ని టీడీపీ నేత‌ల‌కు అర్థ‌మైంది. ఆ వెంట‌నే రంగంలోకి దిగిన సోమిరెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి త‌దిత‌రులు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు ప్రారంభించారు. అదే స‌మ‌యంలో ఎమ్మెల్యే చ‌ర్య‌ల‌ను ఇక ఉపేక్షించ‌రాద‌ని నిర్ణ‌యించుకున్న చంద్ర‌బాబు స్వ‌యంగా జోక్యం చేసుకుని త‌క్ష‌ణం ఆ ఎమ్మెల్యేని త‌న‌ను క‌ల‌వ‌మ‌ని ఆదేశించాల్సిందిగా పార్టీ నేత‌ల‌కు చెప్పారు. ఎమ్మెల్యే సంగ‌తేందో తేల్చాలంటూ నిఘావ‌ర్గాల‌కు కూడా చంద్ర‌బాబు సూచించిన‌ట్లు స‌మాచారం.

Loading...

Leave a Reply

*