బూతుతోనే బ‌య‌ట‌ప‌డ‌దామ‌నుకుంటున్న ర‌ఘువీరా!

raghuveera

అడ్డ‌గోలుగా రాష్ట్రాన్ని విభ‌జించి అడ్ర‌స్ లేకుండా పోయింది కాంగ్రెస్‌. గ‌త ఎన్నిక‌ల‌లో ఏపీ జ‌నం కాంగ్రెస్‌ను వంద కిలోమీట‌ర్ల లోతున పాతిపెట్టారు. అక్క‌డి నుంచి పైకి ఎలా రావాలో తెలియ‌క కాంగ్రెస్ నేత‌లు ఆప‌సోపాలు ప‌డుతున్నారు. పార్టీని ఎలా పైకి తేవాలో తెలియ‌క ర‌ఘువీరా స‌హా ప‌లువురు నేత‌లు అష్ట‌క‌ష్టాలు పడుతున్నారు. ఆ క్ర‌మంలోనే కాంగ్రెస్ ఏపీ చీఫ్ తాజాగా చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌త్యేక హోదాపై పోరాటం చేద్దామంటే అది మున్నాళ్ల ముచ్చ‌టే అయిపోయింది. చంద్ర‌బాబు అవినీతి అంటూ జనంలోకి పోదామంటే అది జ‌గ‌న్ వ‌ల్లే కాలేదు. దాంతో కాంగ్రెస్ నేత‌లు కొత్త మార్గాన్ని ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. అదే బూతు మార్గం.

చంద్ర‌బాబును ప‌రుష‌మైన మాట‌ల‌తో, మీడియాలో రాయ‌లేని బాష‌ను ప్ర‌యోగిస్తున్నారు. జ‌గ‌న్ ఆ మ‌ధ్య చంద్ర‌బాబును చెప్పుతో కొట్టండి అంటే సంచ‌ల‌నం అయిపోయింది. దాంతో తామూ అలాగే మాట్లాడితే ఫ‌లితం ఉంటుంద‌నుకున్నారేమో.. ర‌ఘువీరా రెడ్డి కూడా చంద్ర‌బాబుపై అదే అభ్యంత‌ర‌క‌ర భాష‌ను ప్ర‌యోగించారు. చంద్ర‌బాబు సింగ‌పూర్‌, చైనాల సేవ‌లో (ఇక్క‌డో అభ్యంత‌ర‌క‌ర ప‌దాన్ని వాడారు) త‌రిస్తున్నారంటూ బాబుపై ధ్వ‌జ‌మెత్తారు. ఇలా ప‌రుష‌మైన మాట‌లు ప్ర‌యోగిస్తే అవి మీడియాలో వ‌స్తే…. వివాద‌స్ప‌ద‌మైతే… జ‌నంలో చ‌ర్చ జ‌రుగుతుంద‌ని ర‌ఘువీరా త‌దిత‌రులు భావిస్తున్న‌ట్లున్నారు. అయితే, ఈ త‌ర‌హా మాట‌లు త‌మ స్థాయినే దిగ‌జారుస్తాయ‌న్న నిజాన్ని ఈ నేత‌లు తెలుసుకోలేక‌పోతున్నారు.

Loading...

Leave a Reply

*