పీవీ సింధు మ‌రో సంచ‌ల‌నం….!

untitled-14

ఒలింపిక్ సిల్వ‌ర్ మెడ‌ల్ విన్న‌ర్‌, భార‌త ఏస్ షట్ల‌ర్ పీవీ సింధు కెరీర్‌లో మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సిరీస్‌లో విజ‌యం సాధించింది. చైనాలోని ఫుజౌలో జ‌రిగిన చైనా సూప‌ర్ సిరీస్ ఫైన‌ల్‌లో ఆమె విజేత‌గా నిలిచింది. కెరీర్‌లో ఆమెకు ఇది తొలి సూప‌ర్ సిరీస్‌. ఎనిమిదో సీడ్ స‌న్ యుపై జ‌రిగిన ఫైన‌ల్‌లో ఆమె 21-11, 17-21, 21-11 తేడాతో మ్యాచ్‌ని గెలిచింది. మొద‌టి గేమ్‌ని ఈజీగా సొంతంగా చేసుకున్న సింధు, రెండో గేమ్‌లో వెనుక‌బ‌డింది. స‌న్ యు పోరాటం ముందు సింధు డౌన్ అయింది. అయితే, మూడో గేమ్‌లో మ‌ళ్లీ సింధుదే హ‌వా. సింధు ధాటికి స‌న్ యు చేతులెత్తేసింది. ప్ర‌త్య‌ర్ధికి చాన్స్‌లు ఇవ్వ‌కుండా బ‌ల‌మైన షాట్ల‌తో రెచ్చిపోయింది. సింధు దూకుడు ముందు స‌న్ యు చేతులెత్తేసింది.

ఇది సింధుకు ఇది మొద‌టి సూపర్ సిరీస్‌. ఒలింపిక్ తర్వాత ఆమె జ‌పాన్ సూప‌ర్ సిరీస్‌లో ఓడిపోయినా.. ఈ సిరీస్‌ని ఈజీగా ద‌క్కించుకుంది. ఎలాంటి పొర‌పాట్లు లేకుండా, ప్ర‌త్య‌ర్ధుల‌కు చాన్స్‌లు లేకుండా విజేత‌గా అవ‌త‌రించింది. 30 ఏళ్ల చైనా సూప‌ర్ సిరీస్‌లో చైనా అమ్మాయిలు కాకుండా ఇత‌ర దేశ‌పు వ్య‌క్తులు సిరీస్ ద‌క్కించుకోవ‌డం ఇది మూడోసారి. ఇలా రికార్డ్ సృష్టించింది సింధు. మ‌రోవైపు, ఈ సిరీస్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి వెను దిరిగింది మ‌రో భార‌త ష‌ట్ల‌ర్ సైనా.

Loading...

Leave a Reply

*