జ‌య‌ల‌లిత హెల్త్ సిక్రేట్స్ చెర్రీ అత్తా గారి చేతిలోనే…!

untitled-25-1

జ‌య‌ల‌లిత.. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి.. గ‌త 20 రోజులుగా ఆమె చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యంపై మొద‌ట కొన్ని రోజులు ఏం జ‌రుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. హెల్త్ బులెటిన్ కూడా ఇవ్వ‌లేదు. ఆమె ఆరోగ్యం స్థితిగ‌తుల‌పై త‌మిళ‌నాట ఎన్నో ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నా.. చిన్న లీక్ కూడా రాకుండా అపోలో ఆసుప‌త్రి అన్ని చ‌ర్య‌లు ప‌క‌డ్బందీగా తీసుకుంది. అయితే, కొన్ని రోజుల త‌ర్వాత జ‌య‌ల‌లిత ఆరోగ్యం కుదుట‌ప‌డింద‌ని, ఆమె కోలుకుంటున్నార‌ని, పేప‌ర్‌లు కూడా చ‌దువుతున్నార‌ని మీడియా క‌థ‌నాలు వ‌స్తున్నాయి.ఇవ‌న్నీ ఇలా ఉంటే.. జ‌య‌ల‌లిత ఆరోగ్యంపై మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ అన్నీ అపోలో చైర్మ‌న్ సి.ప్ర‌తాప రెడ్డి కూతురు ప్రీతా రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం.

జ‌య‌లలిత ఆరోగ్యం క్షీణించిన తొలి రోజు రాత్రి.. మొద‌ట పోయెస్ గార్డెన్ సిబ్బందితోపాటు జ‌య‌లలిత‌న ఇష్ట‌స‌ఖి శ‌శిక‌ళ ఆమెను మ‌రో ఆస్ప‌త్రిలో చేర్పించాల‌ని అంబులెన్స్ సిద్ధం చేశార‌ట‌. అపోలో హాస్ప‌ట‌ల్‌లో అయితే రోజూ వంద‌ల మంది పేషెంట్స్ వ‌స్తుంటార‌ని, అక్క‌డ అంతా గ‌జిబిజిగా ఉంటుంద‌ని, అమ్మ ఆరోగ్యంపై చిన్న లీక్ కూడా బయ‌ట‌కు రావాలంటే మ‌రో ఆస్ప‌త్రి అయితేనే బెట‌ర్ అని భావించార‌ట‌. అయితే, జ‌య‌ల‌లిత సెక్రట‌రీ అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ప్రీతా రెడ్డికి ఫోన్ చేసి అమ్మ ఆరోగ్యం ప‌రిస్థితిని వివ‌రించార‌ట‌. వెంట‌నే ఆమె అంబులెన్స్ డ్రైవ‌ర్‌కి కూడా రూట్ మార్చి చివ‌రికి అపోలో ఆస్ప‌త్రికి వ‌చ్చేలా చేశార‌ట‌.ఆ వెంట‌నే ఆమె సిటీలోని టాప్ మోస్ట్ డాక్ట‌ర్‌ల‌నంద‌రినీ పిలిపించి.. చ‌ర్య‌లు ప్రారంభించార‌ట‌. అన్ని విభాగాల డాక్ట‌ర్‌ల స‌హ‌కారం తీసుకొని ప్ర‌తిక్ష‌ణం అమ్మ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ..

ఆస్ప‌త్రి నుంచి చిన్న లీక్ కూడా బ‌య‌ట‌కు పొక్క‌కుండా ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేశార‌ట‌. ఇటు, జ‌య‌ల‌లిత వ్య‌క్తిగ‌త డాక్ట‌ర్‌ల సిబ్బందిని కూడా క‌లుపుకొనిపోతూ, వారి సూచ‌న‌లు, స‌ల‌హాల మేర‌కు.. ఆమె ఆరోగ్యం కాస్త కుదుట‌ప‌డేదాకా ప్రీతా రెడ్డి ప్ర‌తి బాధ్య‌త‌ను తానే తీసుకున్నార‌ట‌. ఇలా, అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ప్రీతా రెడ్డి ప్ర‌ద‌ర్శించిన స‌మ‌య‌స్ఫూర్తికి ఇప్పుడు అన్నివైపులా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది.అపోలో సి. ప్ర‌తాప్‌రెడ్డి న‌లుగురు కూతుళ్ల‌లో ఒక‌రు ప్రీతా రెడ్డి. ఆవిడే పెద్ద కూతురు. బిఎస్సీ చేసిన ఆవిడ‌.. ఆత‌ర్వాత ఆస్ప‌త్రి మేనేజ్‌మెంట్ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్నారు. ఆవిడే రెండో చెల్లెలే శోభ‌నా కామినేని. ఆవిడే.. ఉపాస‌న త‌ల్లి. రామ్‌చ‌ర‌ణ్ అత్త‌గారు. ఇలా, జ‌య‌ల‌లిత ఆరోగ్యం కుదుట‌ప‌డ‌డంలో ఉపాస‌న పెద్ద‌మ్మ తీసుకున్న చ‌ర్య‌లే కార‌ణ‌మ‌ని ఓ ఆంగ్ల ప‌త్రిక స‌వివ‌రంగా రాసింది.

Loading...

Leave a Reply

*