సైరస్ మిస్త్రీ కంటే ప్రభాస్, అనుష్కలు గొప్పోళ్లా?

anushka

ఎక్కడు పుట్టావన్నది ముఖ్యం కాదు… ఎవరికి పుట్టావన్నది అంతకంటే ముఖ్యం కాదు…. ఏ కులంలో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో పుట్టావన్నదీ ముఖ్యం కాదు… వ్యక్తి గుణ‌గ‌ణాలను బ‌ట్టే సంస్కారం వ‌స్తుంది…… అమెరికాలోని హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నా ఫార్వ‌ర్డ్ ఆలోచ‌న‌లు ఉండ‌క‌పోవ‌చ్చు…. మున్సిపాలిటీ స్కూల్లో చదువుకున్న‌వాళ్ల‌కు జంటిల్‌మేన్ లాంటి ప‌ర్స‌నాలిటీ ఉండ‌చ్చు..ఎంతో ఉన్న‌త చ‌దువులు చ‌దివినా ఉన్న‌త వ్య‌క్తిత్వం ఉండ‌క‌పోవ‌చ్చు… అస‌లు చదువుకోని వాళ్లు ఎంతో పెద్ద‌మ‌నుషులు కావ‌చ్చు… పెద్ద‌మ‌నుషులుగా చ‌లామణీ అయ్యేవాళ్ల‌కు చిన్న‌బుద్ధులు ఉండ‌చ్చు…మెడిసిన్‌, ఇంజినీరింగ్ చ‌దివి అమెరికా వెళ్లినా స‌గ‌టు మ‌నుషుల‌కు వెగ‌టు బుద్ధులు పోక‌పోవ‌చ్చు… వెకిలి వేషాలు వేస్తూనే ఉండ‌చ్చు.. వానాకాలం చ‌దువులు చ‌దివి ఇండియాలోనే వాళ్లు ఉన్న‌తంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు… చ‌దువుకు సంస్కారానికి అస్స‌లు సంబంధం లేదు..

డ‌బ్బుకు వ్య‌క్తిత్వానికి కూడా సంబంధం లేదు… అందుకే దేశంలోని అతి పెద్ద కార్పొరేట్ గ్రూప్ టాటా గ్రూప్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి పీకేయ‌బ‌డ్డ సైర‌స్ మిస్త్రీ కంటే ప్ర‌భాస్‌, అనుష్క‌లే గొప్ప‌వాళ్లు అంటున్నారు మేధావులు…. టాటా గ్రూప్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి ఉద్వాస‌న ప‌ల‌క‌గానే స్వార్థ‌మే ప‌ర‌మార్థంగా రెచ్చిపోయి క‌న్న‌త‌ల్లి లాంటి కంపెనీ ప‌రువు తీసి త‌ను బోర్డుతో జ‌రిపిన ఈమెయిళ్ల స‌మాచారాన్ని మీడియాకు ఎక్కించి ర‌చ్చ చేసిన సైర‌స్ మిస్త్రీని ఇస్త్రీ చేయాలంటున్నారు మేధావులు… టాటా అంటే ఈ దేశం మెచ్చుకునే బ్రాండ్‌… భార‌త్‌కు బ్రాండ్‌నేమ్ పేరే టాటా….అలాంటి టాటాల‌ను వెన్నుపోటు పొడిచిన సైర‌స్ మిస్త్రీకి ఎన్ని వేల కోట్లు ఉంటే ఏం లాభం…ఎంత చ‌దువు ఉంటే ఏం లాభం…అలాంటివాడి కంటే ప్ర‌భాస్‌, అనుష్క‌లు న‌య‌మ‌ని మేధావులు అన‌డానికి కార‌ణాలు ఉన్నాయి…

రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాను శిల్పంలా చెక్కుతుంటే త‌న జీవితంలో అత్యంత విలువైన ఐదేళ్లు రాజ‌మౌళికి ధార‌పోసిన ప్ర‌భాస్ దాన్ని గురించి ఒక్క మాట మాట్లాడ‌లేదు…. ఎన్నో సినిమాలు కోల్పోయి తాను కోల్పోయిన కోట్లు, తాను కోల్పోయిన విలువైన కాలం, ప‌డ్డ బాధ‌లు, క‌ష్ట‌న‌ష్టాలు…. వీట‌న్నింటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా మౌనం వ‌హించిన ప్ర‌భాస్ వ్య‌క్తిత్వం ఎంతో గొప్ప‌ది కాబ‌ట్టే ద‌క్షిణ భార‌త చ‌ల‌న‌చిత్ర సీమ నుంచి తొలి వ్య‌క్తిగా తొలి హీరోగా మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైన‌పు విగ్ర‌హంలా త‌ల ఎత్తుకు నుంచున్నాడు… అంతేకాదు అనుష్క స్టార్ హీరోయిన్‌.. హీరోల‌తో పోలిస్తే హీరోయిన్ల‌కు సినిమా లైఫ్ స్పాన్ చాలా త‌క్కువ‌గానే ఉంటుంది…అయినా త‌న క‌ష్ట‌న‌ష్టాల గురించి అనుష్క పెద‌వి విప్ప‌లేదు… సో… సైర‌స్ మిస్త్రీ కంటే ప్ర‌భాస్‌, అనుష్క‌లే గ్రేట్‌.

Loading...

Leave a Reply

*