పెట్ కూల్‌డ్రింక్ బాటిళ్ల‌లో పాయిజ‌న్‌

pet

చిన్న బాటిళ్లు పెద్ద ముప్పు అంటున్నారు నిపుణులు… పెట్ బాటిళ్ల‌లో దొరుకుతున్న కూల్ డ్రింక్స్‌తో భ‌ద్రం బీకేర్‌ఫుల్ బ్ర‌ద‌ర్ అంటున్నారు నిపుణులు….. ప్యాంటు జేబులో దాచుకుని గాల్ ఫ్రెండ్‌ని టీజ్ చేస్తూ ఇచ్చే చిన్న కూల్‌డ్రింక్ బాటిల్‌తో మీరు హిట్ అవ‌రు ఫ‌ట్ అవుతారు…అది కోలాహ‌లం కాద‌ని హాలాహ‌లం అని హెచ్చ‌రిస్తున్నారు సైంటిస్టులు….. పెట్ బాటిళ్ల‌లో ఉన్నది కూల్‌డ్రింక్ కాదు… కూల్ పాయిజ‌న్‌… ఇవి తాగితే కూల్‌కూల్‌గా చ‌ల్ల‌చ‌ల్ల‌గా చ‌చ్చిపోతారుట‌… పెట్‌బాటిల్ప్ వాడ‌కం ఎంత ముప్పు తెస్తుందో భార‌త ప్ర‌భుత్వానికి నివేదిస్తూ ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ త‌న రిపోర్టును స‌మర్పించింది… రెండు మల్టీ నేష‌న‌ల్ కంపెనీలు అంటే పెప్సీకోలా, కోకో కోలా కంపెనీలు త‌యారుచేసే పెట్ బాటిళ్ల‌లో ప్ర‌మాద‌క‌ర‌మైన పదార్థాలు ఉన్నాయ‌ని ఆ సంస్థ త‌న రిపోర్ట్‌లో తేల్చింది…

కోక్‌, పెప్సీల‌కు సంబంధించి 600 ఎంఎల్ పెప్సీ, కోకోకోలా, మౌంటెన్ డ్యూ, స్ప్రైట్‌, సెవెన్అప్ కూల్‌డ్రింక్స్ పెట్ బాటిళ్ల‌ను పరిశీలించి ఈ మేర‌కు నివేదిక ఇచ్చింది…ఈ పెట్‌బాటిల్ డ్రింక్స్‌లో యాంటీమొనీ, లెడ్‌, క్రోమియం, కాడ్మియం, ఇథైలెక్సీల్‌, డై ఫైలేట్ లాంటి అపాయ‌క‌ర‌మైన నిషేధిత భార‌లోహాల అవ‌శేషాలున్న‌ట్టు తెలిపింది… ఈ పెట్ కూల్‌డ్రింక్స్ బాటిళ్ల‌ను రిఫ్రిజిరేట‌ర్ల‌లో ఉంచిన‌ప్పుడు ఆ చ‌ల్ల‌ద‌నంతో భార‌లోహాల ప‌రిమాణం పెరుగుతోంది… అయితే ఈ రిపోర్టుపై మ‌ల్టీ నేష‌న‌ల్ కూల్‌డ్రింక్ కంపెనీలు నోరు మెద‌ప‌డం లేదు… అటు పెట్ కంటైన‌ర్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ అసోసియేన్ కూడా ఈ వార్త‌ల‌పై కిమ్మ‌న‌కుండా కూర్చుంది… సో నెటిజ‌న్లు సిటిజ‌న్లు యూట్యూబ్ బేబీస్ పెట్ బాటిల్స్‌ని జేబులో పెట్టుకుని కూల్‌డ్రింక్స్ లాగించేముందు జ‌ర సోచో. కూల్ పాయిజ‌న్ తాగుతున్నామ‌ని గ్ర‌హించండి.

Loading...

Leave a Reply

*