ఆకాశంలో అద్భుతం.. ఈ నెల 14న‌.. వందేళ్ల‌కోసారి మాత్ర‌మే..!

sky

జ‌న్మ‌కో శివ‌రాత్రి అంటారు. అలాంటిదేన‌ట ఇది కూడా. కొన్ని అద్భుతాలు ఎప్పుడూ జ‌ర‌గ‌వు. జరిగిన టైమ్‌లో మ‌నం ఉండం. జ‌రగ‌బోతున్న‌దని ముందే తెలిసి కూడా వాటికి దూరంగా ఉంటే మ‌నది వెరీ బ్యాడ్ ల‌క్‌. శతాబ్దానికో మారు జ‌రిగే ఆకాశ‌పు అద్భుతం ఈ నెల 14న జ‌ర‌గ‌నుంద‌ట‌.

1948లో ఇలాంటి అద్భుత‌మే ఓసారి జ‌రిగింది. ఆ త‌ర్వాత మ‌రోసారి ఇప్పుడే న‌ట‌. ఈసారి మిస్ అయితే, 2034లోనే జ‌రిగే చాన్స్ ఉంద‌ట‌. ఆ త‌ర్వాత ఈ శ‌తాబ్దంలో మ‌రెప్పుడూ జ‌రిగే అవకాశ‌మే లేద‌ట‌.

ఇంత‌కీ ఆ రోజు ప్ర‌త్యేకత ఏంటంటారా…? ఆ రోజు.. చంద్రుడు భూమికి అత్యంత ద‌గ్గ‌ర‌గా రానున్నాడు. ఆ రోజు చంద్రుడు రోజూ క‌నిపించే దానికంటే 14 శాతం పెద్ద‌దిగా, 30 శాతం ప్ర‌కాశవంతంగా చంద్రుడు క‌నిపించనున్నాడు. ఆకాశంలో ఈ అద్భుతం రెండు గంట‌ల‌పాటు క‌నిపించ‌నుంది. చంద్రుడు సాధార‌ణంగా కంటే పెద్ద‌దిగా క‌నిపించ‌డాన్ని సూప‌ర్‌మూన్ అంటారు. ఆ రోజున అదే జ‌ర‌గ‌నుంది. ప్ర‌తియేటా క‌నిపించే సూప‌ర్‌మూన్ కంటే… ఈ సూప‌ర్‌మూన్ వెరీ స్పెష‌ల్ అట‌. చంద్రుడు భూమికి అత్యంత స‌మీపానికి చేరుకోవడాన్ని పెరీజీ అంటారు. ఇదే రోజున చంద్రుడు, భూమి, సూర్యుడు వ‌ర‌స‌గా క‌నిపిస్తారు. సూర్యుడు, చంద్రుడు ఒకదానికొకటి వ్యతిరేక దిశలలో ఉండడం వల్ల చంద్రుడు మనకు అతిపెద్దగా కనిపించనున్నాడు. మ‌రి, మీరు కూడా ఈ వినీలాకాశ‌పు అద్భుతం కోసం వెయిట్ చేస్తున్నారా..?

Loading...

Leave a Reply

*