జియో అంటే చాలు.. బాబోయ్ అంటున్న జనాలు…

jio

జియో సిమ్ కోసం జనాలు ఇంకా ఎగబడుతూనే ఉన్నారు. చాలా ఔట్ లెట్స్ లో ఫోన్ కొంటే జియో సిమ్ ఫ్రీ ఆఫర్లు కనిపిస్తూనే ఉన్నాయి. భలే మంచి చౌకబేరం అనుకుంటూ అర్బన్ నుంచి రూరల్ వరకు కుర్రాళ్లు ఎగబడుతూనే ఉన్నారు. ఎంత తొందరగా జియో జనాల్లోకి చొచ్చుకెళ్లిందో… అంతే తొందరగా నెగెటివ్ మార్కులు కూడా వేయించుకుంది. మిగతా నెట్ వర్క్స్ తో కూడా సంయుక్తంగా ముందుకెళ్లాల్సిన జియో.. చాలా అంశాల్లో మిగతా నెట్ వర్క్స్ కు హ్యాండ్ ఇవ్వడంతో.. వాళ్లు కూడా జియోకు హ్యాండ్ ఇచ్చారు.

ఫలితంగా జియో కొందరితో బాబోయే అనిపిస్తోంది.స్వయంగా ట్రాయ్… జియో సేవల్ని చెత్త సర్వీస్ గా గుర్తించింది. మిగిలిన టెలికాం కంపెనీల కంటే జియో స్పీడ్ దారుణంగా ఉందని ప్రకటించింది. ట్రాయ్ పరీక్షల్లో జియో స్పీడ్‌ ఐదవ స్థానంలో నిలిచింది. అత్యంత వేగంగా 4జీ డేటా సేవలు అందిస్తున్న సంస్థగా ఎయిర్‌టెల్ నిలిచింది. దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో 4జీ డేటా వేగాన్ని ట్రాయ్ పరీక్షించింది. ఇందులో ఎయిర్‌టెల్ 4జీ సెకనుకు 11.4 మెగాబైట్స్‌( ఎంబీపీఎస్) స్పీడ్‌తో మొదటి స్థానంలో ఉంది.

ఆ తర్వాతి స్థానాల్లో అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌ కామ్ 4జీ సేవలు 7.9 ఎంబీపీఎస్, ఐడియా 7.6 ఎంబీపీఎస్, వొడాఫోన్ 7.3 ఎంబీపీఎస్ స్పీడ్‌తో వరుసగా ఉన్నాయి. రిలయెన్స్ జియో మాత్రం కేవలం 6.2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆఖరి స్థానంలో నిలిచింది. ఒక్క స్పీడ్‌ విషయంలోనే కాకుండా కనెక్టివిటీ విషయంలోనూ రిలయన్స్ జియో దారుణంగా వెనుకబడిపోయిందని ట్రాయ్ అంటోంది.

Loading...

Leave a Reply

*