జియో సిమ్ములు వెన‌క్కి ఇచ్చేస్తున్న జ‌నం

jio

కాల్స్ ఫ్రీ డేటా ఫ్రీ అంటూ ఇండియ‌న్ టెలికం రంగంలో డేటాగిరి చేసిన ముఖేష్ అంబానీ రిల‌య‌న్స్ జియోకు జ‌నం మొద‌ట జ‌య‌హో అన్నారు… జైజై జియో బైబై ఎయిర్‌టెల్‌, ఓడా, ఐడియా అన్నారు…. జియో డేటాగిరీకి జ‌నం గులాంగిరీ చేశారు… అయితే ఇప్పుడు ఫ్రీ సిమ్ము సీన్ సితార్ అయింది… దీంతో జ‌నం తిర‌గ‌బ‌డుతున్నారు… వేరే నెట్‌వ‌ర్క్‌ల నుంచి జియోకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్స్ వెళ్ల‌డం లేదు…. జియో నుంచి వేరే నెట్‌వ‌ర్క్‌ల‌కి ఫోన్ చేస్తే ఆ కాల్స్ కూడా వెళ్ల‌డం లేదు… సింపుల్‌గా చెప్పాలంటే జియో నుంచి కాల్స్ వెళ్ల‌డం లేదు రావ‌డం లేదు… దానికి ఎవ‌రైనా రింగ్ చేసినా, ఆ సిమ్‌తో మ‌నం కాల్ చేసినా కాల్ వెంట‌నే క‌ట్ అయిపోతోంది….

క‌నీసం ఇర‌వై ముప్పై సార్లు కొడితే కానీ కాల్ క‌ల‌వ‌డం లేదు…. కాల్స్ వెళ్ల‌క‌పోవ‌డం కాల్స్ రావ‌క‌పోవ‌డంతో జ‌నానికి కాలుతోంది…అంతేకాదు ఒక‌వేళ కాల్ వ‌చ్చినా క‌లిసినా మాట్లాడుతుంటే కాల్ క్లారిటీగా వినిపించ‌డం లేదు…. ఇత‌ర నెట్‌వ‌ర్కుల్లో వినిపించినంత క్లారిటీగా హాయిగా ఉండ‌ట్లేదు… దీంతో కాల్స్ వెళ్లినా వ‌చ్చినా హాయిగా మాట్లాడుకోలేక‌పోతున్నారు వినియోగ‌దారులు… అవ‌త‌ల‌వాళ్లు మాట్లాడేది స‌రిగా విన‌బ‌డి చావ‌డం లేద‌ని స‌ణుక్కుంటున్నారు జ‌నం… దీంతో మీ సిమ్ములు వ‌ద్దు ఫ్రీ సొమ్ములు వ‌ద్దు అంటున్నారు జ‌నం…. ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ తాగుతామా….

అస‌లు ప‌నిచేయ‌ని సిమ్ముల‌కు కాల్స్ ఫ్రీ ఇచ్చినా డేటా ఫ్రీ ఇచ్చినా మాకొద్దు బాబోయ్ అంటున్నారు… అందుకే అన్నారు మేధావులు ఫ్రీగా వ‌చ్చేవి సరిగా ప‌నిచేయ‌వ‌ని… దీనికితోడు జియోతో పోటీ ప‌డి మ‌రీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్న ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లు జియోకి త‌మ పోర్టులు ఇవ్వ‌డం లేదు… దీంతో జియో నుంచి కాల్స్ స‌రిగా వెళ్ల‌ట్లేదు.. రావ‌ట్లేదు.. దీంతో కుయ్యోమొర్రో అంటున్న జ‌నం జియో సిమ్ముల‌ను వెన‌క్కి ఇచ్చేస్తున్నారని స‌మాచారం.. ఈ ప‌రిణామాల‌తో ఖంగు తిన్న అంబానీ ఈ చిక్కుల నుంచి బ‌య‌ట‌ప‌డే ఉపాయం అన్వేషిస్తున్నాట్ట‌.

Loading...

Leave a Reply

*