ఇదే నేటి ట్రెండ్.. శృంగారం కంటే వైఫైయే కావాలంటున్న యూత్‌..!

wifi

జ‌నాల ప‌ల్స్ మారుతోంది. వారి అభిరుచులు, అభిమ‌తాలు కూడా మారిపోతున్నాయి. నిన్న‌టిదాకా సెల్‌ఫోన్‌లో గంట‌ల త‌రబ‌డి మాట‌లు చెప్పుకునే ల‌వ్ జంట‌లు ఇప్పుడు రూట్ మార్చాయి. ఎక్కువ‌గా చాటింగ్‌నే ఆశ్ర‌యిస్తున్నార‌ట‌. ఇక‌, భార్యాభ‌ర్తల సంగ‌తయితే స్పెష‌ల్‌గా చెప్పాల్సిన ప‌నిలేద‌ట‌. వారు కూడా దాంప‌త్యం కంటే వైఫేయే కావాలంటున్నారు. ప‌చ్చ‌ని కాపురంలో నిప్పులు పోస్తోంద‌ట వైఫై.వైఫై జీవితంలో ఓ నిత్యావ‌స‌రంగా మారింది. అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాదు.. అభివృద్ధి చెందుతున్న ఇండియాలాంటి దేశాల్లోనూ వైఫైని వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

అమెరికా, ఐరోపాల్లోని దాదాపు 1700 మంది ఉద్యోగుల‌పై ఐపాస్ అనే వైఫై క‌నెక్ష‌న్ స‌ర‌ఫ‌రాదారులు ఈ విష‌యం చెబుతున్నారు. సెక్స్‌, చాక్‌లెట్‌, మ‌ద్యం కంటే త‌మ‌కు వైఫైయే ముఖ్య‌మైన నిత్యావ‌స‌రం అని స‌ర్వేలే పాలుపంచుకున్న వారిలో 40శాతం మంది చెబుతున్నారు. సెకండ్ ప్లేస్ శృంగారానికి ఇస్తున్నారు. 37 శాతం మంది త‌మ‌కు శృంగారం ముఖ్య‌మ‌ని చెప్ప‌గా, థ‌ర్డ్ ప్లేస్‌లో చాక్‌లెట్‌ని ఇష్ట‌ప‌డేవారున్నారు. అన్నింటికంటే అతి త‌క్కువ ప్రాముఖ్య‌త లిక్క‌ర్‌కి ఇచ్చారు. వైఫై, శృంగారం కంటే మందు త‌మ‌కు పెద్ద ఇంపార్టెంట్ కాద‌నే వారే ఎక్కువ ఉండ‌డం విశేషం. చాలా మంది వైఫై త‌మ జీవితంలో ఎంతో మేలు చేసింద‌ని, త‌మ జీవన ప్ర‌మాణాల‌ను ఏకంగా 75 శాతం పెంచిందని చెబుతుండ‌డం విశేషం.

Loading...

Leave a Reply

*