జ‌న‌సేన‌లోకి జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌..ప‌వ‌న్ సీక్రెట్ మంత‌నాలు..?

untitled-14

ప‌వ‌న్ పాలిటిక్స్‌ను సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. నిన్న‌టిదాకా సినిమాలకే ఫుల్ టైమ్ స‌మయాన్ని కేటాయించిన జ‌న‌సేనాని ఇక‌పై దూకుడు పెంచుతున్నాడు. అటు కాట‌మ‌రాయుడు సినిమాతో షూటింగ్‌లో ఉంటూనే.. ఇటు పాలిటిక్స్‌కీ కొంత స‌మయం అందుబాటులో ఉంటున్నాడు. ఇటీవ‌ల ప‌వ‌న్‌.. ఆక్వా మెగా ఫుడ్ పార్క్‌పై గోదావరి ప్ర‌జ‌ల గోసపై ప్రెస్ మీట్ పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా సీబీఐ ఆపీస‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌తో భేటీ అయిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.తాజాగా త‌న ఓటును హైద‌రాబాద్ నుంచి ఏపీకి బ‌ద‌లాయించుకోవాల‌ని భావించిన ప‌వ‌న్‌.. ఇక రాజ‌కీయాల‌పై సీరియ‌స్‌గా దృష్టి సారిస్తున్నార‌ట‌.

అందుకే, ఆయ‌న జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌తో స్పెష‌ల్‌గా మంత‌నాలు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో జేడీ.. జ‌గ‌న్ ఆస్తుల కేసును ప‌ర్య‌వేక్షించారు. అలాంటి జేడీతో ప‌వ‌న్ భేటీ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఏపీ రాజ‌కీయాల‌లో ప్ర‌స్తుతం టీడీపీతో గ‌ట్టి పోటీ ఇస్తోంది జ‌గ‌న్ వైఎస్సార్‌సీ. దీంతో, అక్క‌డ ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టి టీడీపీకి సరైన ప్ర‌తిప‌క్షంగా మారాలంటే జ‌గ‌న్ బ‌ల‌హీన‌త‌ల‌ను ప‌రిశీలించాల‌ని భావిస్తున్నాడ‌ట ప‌వ‌న్‌. అందుకే, జ‌గ‌న్ రాజ‌కీయ బ‌లాన్ని త‌గ్గించి ఆ స్థానంలో తాను చేరిపోవాల‌ని అంచ‌నా వేస్తున్నారని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.ప‌వ‌న్‌.. జ‌న‌సేన ఎన్నిక‌లలో పోటీ చేస్తే టీడీపీ ఓట్లు కొంతవ‌ర‌కు జ‌గ‌న్‌కు ట్రాన్స్ ఫ‌ర్ అవుతాయి.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోతే టీడీపీకే లాభిస్తుంది. దీంతో, ఆయ‌న టార్గెట్ జ‌గ‌న్ మీద ఫోక‌స్ చేశాడ‌ట‌. వైఎస్సార్‌సీ ఓటు బ్యాంక్‌ని కొల్ల‌గొట్టి… ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవాల‌నేది ఆయ‌న అంచ‌నా అని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. అందుకే, జేడీతో ర‌హస్యంగా భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు, ఆయ‌న‌ను పార్టీలోకి రావాల‌ని ప‌వ‌న్ ఆహ్వానించార‌ని, ఆయ‌న వెంట ఉంటే.. అటు టీడీపీ, ఇటు వైఎస్సార్‌సీ అవినీతిని ఎండ‌గ‌ట్ట‌వ‌చ్చ‌ని.. నిజాయితీ గ‌ల వ్య‌క్తిగా ఇది త‌న‌కు బాగా లాభిస్తుంద‌ని అంచనా వేశాడ‌ట ప‌వ‌న్‌. పార్టీలోకి ప‌వ‌న్ ఆయ‌నను ఆహ్వానించార‌నే మాట కూడా వినిపిస్తోంది. మ‌రి, ఇందులో ఏది నిజ‌మో తెలియాలంటే కొంత‌కాలం వెయిట్ చెయ్య‌క‌తప్ప‌దు.

Loading...

Leave a Reply

*