పాక్ బంధీగా మ‌న జ‌వాను

pakistan

భార‌త్ చ‌ర్య‌తో ఉడికిపోతున్న పాకిస్థాన్ మ‌న జ‌వానును బంధించింది. అనూహ్యంగా జ‌రిగిన దాడితో బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్ భార‌త్‌ను ఎలా దొంగ దెబ్బ తీయాలా అని మ‌ధ‌న‌ప‌డుతోంది. అలాంటి స‌మ‌యంలోనే పొర‌పాటున స‌రిహ‌ద్దు దాటిన మ‌న జ‌వాను ఒక‌రిని బంధించింది. నియంత్ర‌ణ రేఖ (ఎల్‌వోసీ) వెంబ‌డి విధులు నిర్వ‌ర్తిస్తున్న రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన చందు బాబూలాల్ చౌహాన్ విధుల్లో నిమ‌గ్న‌మై పొర‌పాటున స‌రిహ‌ద్దు దాటేశార‌ని భార‌త హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌టించారు.

ఉగ్ర‌వాదుల‌పై జ‌రిగిన స‌ర్జిక‌ల్ స్ర్టైక్స్‌లో పాల్గొన లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బాబూలాల్‌ను విడిపించేందుకు పాకిస్థాన్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. దీనిపై చ‌ర్చించేందుకు జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్‌, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో హోంమంత్రి ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. పాక్ బంధించిన భార‌త జ‌వానును క్షేమంగా విడుద‌ల చేయిస్తామ‌ని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. అస‌లే ర‌క్తం మ‌రిగిన పులి… పైగా ప్ర‌తీకారంతో ర‌గిలిపోతోంది… ఈ ద‌శ‌లో పాకిస్థాన్ ఏం చేస్తుందో అన్న ఆందోళ‌న అంద‌రిలో నెల‌కొంది.

Loading...

Leave a Reply

*