14 ఏళ్ల అబ్బాయి..21 ఏళ్ల అమ్మాయి – ఆన్‌లైన్ రొమాన్స్‌

untitled-11

14 ఏళ్ల ఏళ్ల అబ్బాయి… 21 ఏళ్ల అమ్మాయి… ఇద్ద‌రు ఆన్‌లైన్‌లో ఒక‌రికొక‌రు ప‌రిచ‌య‌మ‌య్యారు…. ఇద్ద‌రివి వేరువేరు దేశాలు…వేరు వేరు మ‌తాలు.. ఇద్ద‌రి ప‌రిచయం ప్రేమ‌గా మారింది… ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్లాల‌నుకున్నారు…ల‌వ్వుకు కులం మ‌తం ప్రాంతం దేశంతో ప‌నిలేదని పాటలు పాడుకున్నారు… ఆన్‌లైన్ సాక్షిగా ఊహ‌లు గుస‌గుస‌లాడాయి…ఆన్‌లైన్‌లో స‌ర‌సాల్లో మునిగితేలారు.. రొమాన్స్‌తో రెచ్చిపోయారు.. ఆన్‌లైన్ ల‌వ్వులో నిండామునిగి తేలిన అబ్బాయి చివ‌ర‌కు కెవ్వు కేక పెట్టాల్సి వ‌చ్చింది…. ఆన్‌లైన్ రొమాన్స్ అబ్బాయిని అడ్డంగా ముంచింది….క‌ట‌క‌టాల‌పాలు చేసింది… అబ్బాయి పేరు అబు సిన్‌.. అత‌డిది సౌదీ అరేబియా.. అమ్మాయి పేరు క్రిస్టినా కాకెట్‌.. ఆమెది అమెరికాలోని కాలిఫోర్నియా… వీరి ప్రేమాయ‌ణం జోరుగా సాగింది.. ఆన్‌లైన్‌లో రోజు ముద్దుముచ్చ‌ట్లు చెప్పుకునేవాళ్లు..

ఒక‌రోజు న‌న్ను పెళ్లి చేసుకుంటావా అని క్రిస్టీనాని అడిగాడు సిన్‌.. ఆమె కూడా ఓకే అంది.. అయితే సౌదీ అరేబియా అస‌లే మ‌త‌పిచ్చి మూర్ఖ‌పు దేశం… విప‌రీత విశ్వాసాల‌తో జ‌నం ప్రాణం తీస్తారు అక్క‌డ‌…అక్క‌డి నిఘా వ‌ర్గాలు ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టాయి… త‌మదేశ‌పు అబ్బాయి వేరే దేశ‌పు అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని ఆన్‌లైన్‌లోరొమాన్స్ చేసుకుంటున్నార‌ని క‌నిపెట్టారు…సోష‌ల్ వెబ్‌సైట్ల‌ను మానిట‌రింగ్ చేసే మ‌త అధికారుల టీమ్ కుర్రాడిపై రెచ్చిపోయింది.. సౌదీ సంప్ర‌దాయాల‌ను, మ‌త విశ్వాసాల‌ను మంట గ‌లిపాడంటూ అత‌డిపై ఆగ్ర‌హించింది… అంతే అత‌డిని తీసుకువెళ్లి జైల్లో పారేశారు…కుర్రాడు కుయ్యోమొర్రో అన‌డంతో క‌నిక‌రించారు… భారీగా డ‌బ్బు క‌ట్టాక బెయిల్ ఇచ్చి జైలు నుంచి పంపించారు…సౌదీలో పరాయి స్త్రీల‌తో ఆన్‌లైన్‌లో డేటింగులు, చాటింగులు చేస్తే ఇలా తాట తీస్తారు.

Loading...

Leave a Reply

*