రూపాయికే 4జీ… ఇదే స‌రికొత్త ఐడియా

idea

ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటూ రంగంలోకి వ‌చ్చిన ఐడియా సెల్యూలాయిడ్ సంస్థ ఇప్పుడు బంప‌ర్ ఆఫ‌ర్ను ప్ర‌క‌టించింది. ఉచిత ఆఫ‌ర్ల‌తో వినియోగదారుల‌కు వ‌ల వేస్తున్న రిల‌య‌న్స్ జియోకు చెక్ పెట్టేందుకు స‌రికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. ఒక్క రూపాయికే అన్‌లిమిటెడ్ 4జీ డేటాను అందుబాటులోకి తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మీ ఫోన్‌లో కేవ‌లం రూపాయి బ్యాలెన్స్ ఉంటే చాలు ఇక మీరు నిశ్చింతగా ఐడియా నుంచి 4జీ సేవ‌ల‌ను అప‌రిమితంగా వినియోగించుకోవ‌చ్చు.

ఇందుకు మీరు చేయాల్సింది ఇదే… మీ 4జీ మొబైల్‌లో ఐడియా సిమ్ నుంచి 411కు కాల్ చేయండి. అందులో వ‌చ్చే సూచ‌న‌లు ఫాలో అవ్వండి. ఆ వెంట‌నే ఈ స‌రికొత్త ఆఫ‌ర్ యాక్టివేట్ అవుతుంది. ఆ త‌ర్వాత మీరు నిశ్చింతంగా 4జీ డేటాను ఓ గంట పాటు ఉచితంగా వాడుకోవ‌చ్చు. ఈ గంట‌లో 4 జీబీ నుంచి 5 జీబీ వ‌ర‌కూ ఉచితంగా అత్యంత వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే, ఒకే ఫోన్ నుంచి మూడు సార్లు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ వాడుకునే సౌల‌భ్యం ఉంది.

Loading...

Leave a Reply

*