ఒకే వ్య‌క్తి… ఆరు ప్రాణాలు!

subbareddy

అత‌డో సాధార‌ణ గుమ‌స్తా. రోజు ప‌నికి వెళ్తే కాని పొట్ట‌నిండ‌ని క‌డుపేద‌. అయితేనేం ఆ కుటుంబం… ఆరుగురికి జీవితాన్నిచ్చింది. ఆరు కుటుంబాల్లో వెలుగులు నింపింది. త‌న భ‌ర్త బ‌త‌క‌డ‌ని తెలిసిన ఆ ఇల్లాలు పెద్ద‌మ‌న‌సుతో అత‌డి అవ‌య‌వ‌దానానికి అంగీక‌రించింది. దాంతో వైద్యులు హుటాహుటిన స్పందించి అత‌డి గుండె స‌హా అవ‌య‌వాల‌ను వేర్వేరు జిల్లాల‌కు త‌ర‌లించి ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్ర‌సాదించారు. ప్ర‌కాశం జిల్లా, ఉల‌వపాడు మండ‌లం క‌రేడుకు చెందిన పెల్లేటి సుబ్బారెడ్డి(36) మ‌ద్యం దుకాణంలో ప‌నిచేస్తుంటాడు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్ర‌మాదంలో అత‌డు గాయ‌ప‌డ‌డంతో నెల్లూరులోని నారాయ‌ణ వైద్య‌శాల‌కు త‌ర‌లించారు. వైద్యులు ప‌రిక్షించి బ్రెయిన్‌డెడ్ అయిన‌ట్లుగా చెప్పారు. ఆ త‌ర్వాత అత‌డి అవ‌యవాల‌ను దానం చేస్తే మ‌రికొంత‌మందికి జీవితాన్ని ఇవ్వ‌వ‌చ్చ‌ని సుబ్బారెడ్ఢి భార్య‌కు చెప్పారు.

దానికి ఆమె అంగీక‌రించింది. ఆ వెంట‌నే రంగంలోకి దిగిన వైద్యులు సుబ్బారెడ్డి గుండెను గుంటూరుకు ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో త‌ర‌లించారు. అక్క‌డ ప్ర‌ముఖ వైద్యుడు గోఖ‌లే ఆధ్వ‌ర్యంలో క‌ర్నూలు జిల్లాకు చెందిన హీరామునిబాయ్‌(28) అనే యువ‌తికి అమ‌ర్చారు. ఇక‌, సుబ్బారెడ్డికి చెందిన రెండు కిడ్నీల‌ను తిరుప‌తి సిమ్స్‌, నారాయ‌ణ వైద్య‌శాల‌ల్లోని రోగుల‌కు, ఊపిరితిత్తుల‌ను చెన్నైలోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న రోగికి, క‌ళ్లు మ‌రో ఆస్ప‌త్రిలోని రోగుల‌కు అమ‌ర్చారు.

Loading...

Leave a Reply

*