కేసీఆర్ ల‌క్కీ నెంబ‌రు మారిందే

untitled-101

తెలంగాణ‌లో నంబ‌ర్లాట న‌డుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో రోజుకో నంబ‌రు తెర‌మీద‌కు వ‌స్తుంది. 27 ద‌గ్గర ప్రారంభ‌మైన మొత్తం జిల్లాల సంఖ్య రెండు రోజులుగా 31, 33, 31 అంటూ నంబ‌ర్ల గేమ్ మొద‌లైంది. కొత్త జిల్లాల కోసం ప్ర‌జ‌ల నుంచి డిమాండ్లు విప‌రీతంగా వ‌స్తుండడంతో కేసీఆర్ కూడా పెద్ద మ‌న‌సు చేసుకుని అడిగినోళ్ల‌కు అడిగిన‌ట్లు జిల్లాలు ఇచ్చేద్దామ‌ని ప్ర‌తిపాదించారు. ఈ క్ర‌మంలోనే సిరిసిల్ల‌, గ‌ద్వాల‌, జ‌న‌గామ జిల్లాల‌కు కేసీఆర్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు బ‌య‌ట‌కు రావ‌డంతో మిగిలిన అంద‌రిలోనూ ఆశ రేగింది.ఇంకేముంది మ‌ళ్లీ జిల్లాల ఉద్య‌మాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యేల రాజీనామాలు, దీక్ష‌లు, బంద్‌లు, ధ‌ర్నాలు, ఆత్మ‌హ‌త్యాయ‌త్నాలతో తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాలు అట్ట‌డుకుతున్నాయి.

ఈ ద‌శలోనే కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ముందు చెప్పిన‌ట్లు 31 కంటే జిల్లాల సంఖ్య పెర‌గ‌ద‌ని ఇక ప్ర‌క్రియ ముగిసింద‌ని ప్ర‌క‌టించేశారు. ఇక ఎవ‌రి ప్ర‌తిపాద‌న‌లు ప‌రిశీలించ‌బోమ‌ని కొత్త‌గా క‌లిపిన సిరిసిల్ల‌, గ‌ద్వాల‌, జ‌న‌గామ‌ల‌తో క‌లిసి 21 జిల్లాలు కొత్త‌గా ఏర్పాటు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అంటే కేసీఆర్ ల‌క్కీ నంబ‌రు ఆరు అని అందుకే 33(3+3=6) జిల్లాల ఏర్పాటుకు సుముఖ‌త వ్య‌క్తం చేశార‌ని వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని తేలిపోయింది. అలాకాకున్నా… ఇప్పుడు 31 జిల్లాలు ఏర్ప‌డుతున్నాయి కాబ‌ట్టి 3+1=4 అవుతుంది కాబ‌ట్టి నాలుగు సీఎం ల‌క్కీ నంబ‌రు అనుకోవాలేమో.

Loading...

Leave a Reply

*