ఏపీలో మ‌హిళకు నో సేఫ్టీ… తెలంగాణ‌లో ఓకే!

ap

ప‌నిచేసే ప్రాంతాల్లో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ వెన‌క‌బ‌డిపోయింది. పొరుగునున్న తెలంగాణ‌తో పోల్చుకున్నా ఏపీలో శ్రామిక మ‌హిళ‌కు భ‌ద్ర‌త క‌రువ‌ని తేలింది. కార్యాల‌యాలు, ప‌రిశ్ర‌మ‌లు, ఇత‌ర ప‌ని ప్రాంతాల‌లో మ‌హిళ‌లు వారి భ‌ద్ర‌త‌పై దేశంలోని అన్ని రాష్ట్రాల‌లో అమెరికాకు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ స్ట్రాట‌జిక్ అండ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట‌డీస్ అనే సంస్థ అధ్య‌య‌నం చేసింది. ఈ అధ్య‌య‌నంలో తెలంగాణ‌కు రెండో స్థానం రాగా, ఆంధ్ర‌కు ఆరో స్థానం వ‌చ్చింది. పెట్టుబ‌డులు సేక‌ర‌ణ‌, ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు, విద్యుత్ స‌ర‌ఫ‌రా ఇలా అన్ని విష‌యాల్లో నెంబ‌ర్‌వ‌న్‌గా ఉండే ఆంధ్ర‌ప్ర‌దేశ్… మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే విష‌యంలో మాత్రం వెనుక‌బ‌డి ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ స‌ర్వే ప్ర‌కారం సిక్కిం అగ్ర‌స్థానంలో నిలిచింది.

అత్యాచారాలు, హ‌త్య‌లు, మ‌హిళ‌ల‌పై దాడులతో ద‌ద్ద‌రిల్లిపోతున్న దేశ రాజ‌ధాని ఢిల్లీ ఈ జాబితాలో అట్ట‌డుగున నిలిచింది. షీ టీమ్స్‌, షీ క్యాబ్‌లు వంటి వినూత్న ప్ర‌యోగాల‌తో తెలంగాణ స‌ర్కారు మ‌హిళా ఉద్యోగుల ర‌క్ష‌ణ‌కు ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటూ ఎంతో మెరుగైన ప‌ని విధానంతో ముందుకు పోతుంద‌ని ఆ అధ్య‌య‌నం వివ‌రించింది. దేశంలోని మొత్తం ఉద్యోగుల‌లో 24 శాతం మాత్ర‌మే మ‌హిళ‌లు ఉన్నార‌ని, వారిపై జ‌రుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంపై ప్ర‌భుత్వాలు పెద్ద‌గా శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని ఆ అధ్య‌య‌నం అభిప్రాయ ప‌డింది. ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం సిక్కిం.. తెలంగాణ‌.. పుదుచ్చేరి, క‌ర్ణాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంది. ఏపీ త‌ర్వాత కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, చ‌త్తీస్‌గ‌ఢ్‌, ఢిల్లీలున్నాయి.

Loading...

Leave a Reply

*