బాబు కోసం వియ్యంకుల కొత్త న్యూస్ పేపర్‌!

babu

ఏపీలో టీడీపీ కోసం ప‌త్రిక పెట్టాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే టీవీ చాన‌ల్ పెట్టాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లు దానికి రిల‌య‌న్స్ అధినేత‌ను సంప్ర‌దించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కొత్త‌గా చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలోని గంటా శ్రీ‌నివాస‌రావు, పి.నారాయ‌ణ‌లు ఒక వార్తా ప‌త్రిక‌ను తేవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. వియ్యంకులైన ఈ మంత్రులిద్ద‌రూ ఒక కొత్త ప‌త్రిక‌ను పెట్టి దానిని పార్టీ కోసం అంకితం చేస్తే ఇక చంద్ర‌బాబు ద‌గ్గ‌ర త‌మ‌కు తిరుగుండ‌ద‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే ప‌త్రిక ఎలా తేవాలి… దానికి చేయాల్సిందేమిటీ అన్న విష‌యాల‌పై వీరిద్ద‌రూ సీరియ‌స్‌గా చ‌ర్చించుకుంటున్నార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇప్ప‌టికే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి సొంత మీడియా ఉంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి అన‌ధికార ప్ర‌తిప‌క్షంగా ఆ మీడియా వ్య‌వ‌హ‌రిస్తూనే ఉంది.

ఆ క్ర‌మంలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను విరివిగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలంటూ ప‌త్రిక ఉండాల్సిందేనని వీరిద్ద‌రూ బ‌లంగా వాదిస్తున్నార‌ట‌. అయితే, సొంత మీడియా పెట్టుకునేందుకు తాను వ్య‌తిరేక‌మ‌ని చంద్ర‌బాబు చాలాసార్లు చెప్పారు. తాము కావాల‌నుకుంటే ఎప్పుడో సొంత ప‌త్రిక‌, చాన‌ల్‌ను ఏర్పాటు చేసుకునేవాళ్ల‌మ‌ని కూడా ఆయ‌న చెబుతుంటారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు ధ‌న‌వంతులైన మంత్రులు తెస్తున్న ప్ర‌తిపాద‌న‌కు బాబు ఓకే చెబుతారో లేదో చూడాలి. అలాగే, రాష్ట్రంలోని ప్ర‌ధాన మీడియా అంతా టీడీపీకి ఫేవ‌ర్‌గానే ప‌నిచేస్తుంది. ఇలాంటి నేప‌థ్యంలో చంద్ర‌బాబు పేప‌ర్ పెట్టుకునేందుకు అవి అడ్డుప‌డ‌కుండా ఉంటాయా అన్న అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Loading...

Leave a Reply

*