2 వేల నోటుపై కొత్త పుకారు… మీదాకా వ‌చ్చిందా..?

untitled-5

అవునా..అసలే కొత్త నోట్లు దొరకక పరేషాన్ అవుతుంటే..మధ్యలో ఇంకో పుకారేంటి? అనుకుంటున్నారా..అయితే ఈ వార్త చదవాల్సిందే. ప్రస్తుతం ఒక్క 2 వేల నోటు కోసం రోజంతా క్యూలో నిలబడి తీసుకున్నారు కదా. మొదట్లో ఈ కొత్త నోట్లు చూసి, అసలు ఇవి ఒరిజినల్ నోట్స్ లాగానే లేవు, చాలా పలుచగా ఉన్నాయని పెదవి విరిచారు ప్రజలు. ఇదే విషయాన్ని మనం టీవీల్లో చూశాం కూడా. ఇక దీనిపై మరో వార్త హల్ చల్ చేస్తోంది. వచ్చే 2019 సాధారణ ఎన్నికలు తరువాత ఈ కొత్త నోట్లు కూడా రద్దు అవుతాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఉన్నపళంగా పాత 500, 1000 నోట్లు రద్దు చెయ్యడంతో, ఈ కొత్త ఇట్లను నామమాత్రంగానే ప్రింట్ చేశారని సమాచారం. ఈ విషయం గురించి అటు బ్యాంక్ అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అందుకే కాబోలు 2 వేల నోటు అంత పలుచగా డిజైన్ చేసి ఉండొచ్చు అనే అనుమాలు కూడా లేకపోలేదు. ఇక ఇప్పటికే పాత 500 నోట్స్, 1000 నోట్స్ తీసేసి, ఏకంగా 2 వేల రూపాయల నోటు రిలీజ్ చేసినందుకు చాలా మంది వ్యతిరేకించారు.

1000 నోటుకే చిల్లర దొరకక చుక్కలు కనపడేవి, ఇక ఇప్పుడు 2 వేల నోటుకి సూర్యుడు కనపడటం ఖాయం అని చాలా మంది అసహనం వ్యక్తం చేశారు.ఇప్పుడు అవి కూడా కొద్ది రోజులే అని తెలిశాక ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో చూడాలి. మరీ అంత షాకవ్వకండి..దీని గురించి ఆర్ బీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చూడాలి మరి మోదీ ఈ పుకారుపై ఎలా స్పందిస్తారో..

Loading...

Leave a Reply

*