కొత్త 2వేల నోటు ఫేక్ చెయ్య‌డం చాలా ఈజీ…మీరు కూడా చేయొచ్చ‌ట‌….!

2000-notes

పెద్ద నోట్లు ర‌ద్దు చేసిన మోడీ అంత‌కు మించి అన్న‌ట్లుగా మ‌రింత పెద్ద‌దైన రెండు వేల నోటును తెర మీద‌కు తెచ్చారు. తొలి రోజు బ్యాంకుల నుంచి కొత్త రెండు వేల నోటులు తీసుకున్న జ‌న‌మంతా వాటిని గ‌ర్వంగా ప్ర‌ద‌ర్శిస్తూ… సెల్ఫీలు దిగుతూ త‌మ ముచ్చ‌ట తీర్చుకున్నారు. ఐదు రోజులు గ‌డిచేస‌రికి ఆ మోజు కాస్త భ‌యంగా మారిపోయింది. ఇప్పుడు రెండు వేల నోటును చూస్తే ఈ దుర‌ద మ‌న‌కెందుకు అన్న‌ట్లుగా పారిపోతున్నారు. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి రెండు వేల నోటుకు చిల్ల‌ర దొర‌క్క‌పోవ‌డం… రెండోది రెండు రోజుల్లోనే రెండు వేల న‌కిలీ నోట్లు చ‌లామ‌ణిలోకి వ‌చ్చాయంటూ ప్ర‌చారం జ‌ర‌గ‌డం. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం కంటే ముందే రెండు వేల నోటు రాబోతుందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

నోటుకు చిప్ పెడుతున్నార‌ని, దాన్ని ట్యాంప‌రింగ్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని మీడియా ఊద‌ర‌గొట్టింది. తీరా జ‌నం చేతికి నోటు వ‌చ్చాక దాన్ని చూస్తూ.. చిప్ కాదు క‌దా ఏ కొత్త‌ద‌న‌మూ లేదు. క‌నీసం పాత నోటుకు ఉన్న క‌ళ కూడా ఈ కొత్త నోటుకు లేద‌ని జ‌న‌మే వ్యాఖ్య‌లు చేశారు. ఇక కొంద‌రైతే ఏకంగా ఆ నోటును క‌ల‌ర్ జిరాక్స్ తీయించి మార్చేసేందుకు సిద్ధ‌మయ్యారు. ఎంతో గొప్ప‌గా రెండు వేల నోటు తెస్తున్నామ‌ని ప్ర‌భుత్వం చేసిన ప్ర‌చారానికి త‌మ క‌ల‌ర్ జిరాక్స్‌తో చెక్ పెట్టారు. ఆలా క‌ల‌ర్ జిరాక్స్‌లు రంగంలోకి రావ‌డంతో పోలీసులు ఒక‌రిద్ద‌రిని అరెస్టు కూడా చేశారు. ఈ నేప‌థ్యంలోనే న‌కిలీ నోట్లు చ‌లామ‌ణిలోకి వ‌చ్చాయంటూ ప్ర‌చారం హోరెత్తింది. దాంతో అంద‌రూ త‌మ చేతితోని రెండు వేల నోటును రెండో రోజు నుంచే అనుమానంగా చూడ‌డం మొద‌లెట్టారు.

Loading...

Leave a Reply

*