క‌డుపులో కాట‌న్ పెట్టి కుట్లేసిన నెల్లూరు డాక్ట‌ర్‌.. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే…?

untitled-14

దేశ‌వ్యాప్తంగా డాక్ట‌ర్‌ల నిర్వాకాలు పెరిగిపోతున్నాయి. చ‌ద‌వేస్తే ఉన్న మ‌తి పోయింద‌ని.. నిన్న గ్లోబ‌ల్ ఆస్ప‌త్రికి హైట్ పెంచుతామంటూ కొంద‌రు డాక్ట‌ర్‌లు.. ఓ యువకుడి జీవితాన్ని చిదిమేశారు. ఇలాంటి నిర్వాక‌మే మ‌రొక‌టి నెల్లూరు జిల్లాలోని నవాబుపేట‌లో జ‌రిగింది. డెలివ‌రీ కోసం ఆస్ప‌త్రికి వెళితే లేడీ డాక్ట‌ర్ నిర్ల‌క్ష్యంతో క‌డుపులో కాట‌న్ పెట్టి కుట్లు వేసింది. ఈ ఏడాది జులై 14న లక్ష్మీ శ్రావ‌ణి ప్ర‌స‌వ వేద‌న‌తో న‌వాబుపేట‌లోని సులోచ‌న‌మ్మ న‌ర్సింగ్ హోమ్‌లో చేరింది. డాక్ట‌ర్ సులోచ‌న ఆమెకు సిజేరియ‌న్ చేసి డెలివ‌రీ చేసింది. ప్ర‌స‌వం బాగా జ‌ర‌గ‌డంతో అంతా ఊపిరి పీల్చుకొని ఆనందంతో ఇంటికి వెళ్లారు.

కొన్ని రోజుల త‌ర్వాత లక్ష్మీ శ్రావ‌ణికి క‌డుపులో నొప్పి ప్రారంభ‌మ‌యింది. అది కొన్ని రోజుల‌కి భ‌రించ‌లేని స్థాయిలో పెరిగింది. దీంతో, వైద్యుల‌ను సంప్ర‌దించింది. గ‌త నెల 25న నెల్లూరులోని సింహ‌పురి సూప‌ర్ స్పెషాలిటీ వైద్యులు ల‌క్ష్మీ శ్రావ‌ణిని స్కానింగ్ చేసి క‌డుపులో పెద్ద మొత్తంలో దూది ఉన్న‌ట్లు గుర్తించారు. వెంట‌నే ఆప‌రేష‌న్ చేసి దూదిని తొల‌గించారు. దీంతో, శ్రావ‌ణి కోలుకుంటోంది. దీనిపై బాధిత మహిళ బంధువులు సులోచనమ్మ నర్సింగ్‌ హోమ్‌ వద్ద శనివారం ఆందోళనకు దిగి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Loading...

Leave a Reply

*