కేసీఆర్‌ను కాపాడ‌ని గ‌వ‌ర్న‌ర్‌!

వ‌రుణుడి ప్ర‌తాపానికి ఉక్కిరిబిక్కిరైన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఒడ్డున ప‌డేశారు. సీఎంగా అధికారం చేప‌ట్టిన త‌ర్వాత కేసీఆర్‌ను మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ వ్య‌వ‌హారం తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు కురిసిన భారీ వ‌ర్షాలే ఆయ‌న ప్ర‌తిష్ట‌కు మ‌చ్చ తెచ్చాయి. ప్ర‌భుత్వం విశ్వ‌న‌గ‌రంగా ప్ర‌చారం చేసుకుంటున్న హైద‌రాబాద్ నాలుగు రోజుల భారీ వ‌ర్షానికి పూర్తిగా జ‌ల‌మ‌యం కావ‌డం ప్ర‌భుత్వానికి నిద్ర‌ను దూరం చేసింది.

కాంక్రీట్ జంగిల్ లాంటి న‌గ‌రంలో ప‌దుల అంత‌స్థుల్లో ఉండే ప్ర‌జ‌లు జ‌ల‌దిగ్బందంలో చిక్కుకుని ఆహారం కోసం అల‌మ‌టించిన ప‌రిస్థితి ప్ర‌పంచంలోని తెలుగువారంద‌రిని క‌ల‌వ‌ర‌ప‌రిచింది. దీనికి స్వ‌యంకృతాప‌రాధ‌మే కార‌ణ‌మైనా స‌హ‌జంగా వ‌చ్చే ప్ర‌జా వ్య‌తిరేక‌త ప్ర‌భుత్వంపైనే ప‌డింది. దాంతో రంగంలోకి దిగిన ప్ర‌భుత్వం త‌క్ష‌ణం ప్ర‌జ‌ల‌ను ఆదుకునే చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆ స‌హాయ‌క చ‌ర్య‌ల‌కూ ఎడ‌తెరిపిలేని వ‌ర్షం ఆటంకంగా మారింది. ఈ ద‌శలో స్పందించిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్… హైద‌రాబాద్‌లో వ‌ర్షాల వ‌ల్ల జ‌రిగిన న‌ష్టానికి ప్ర‌జ‌లే కార‌ణ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇష్ట‌మొచ్చిన‌ట్లు చెరువులు, నాలాల‌ను క‌బ్జా చేసి ఇల్లు క‌ట్టుకోవ‌డంతోనే ఇప్పుడీ విప‌త్తు సంభ‌వించింద‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. తాము చేసిన త‌ప్పుల‌కే ఇప్పుడు జ‌నం అనుభ‌విస్తున్నార‌ని నేరుగానే నెపం ప్ర‌జ‌ల‌పైకి నెట్టారు. దాంతో కేసీఆర్ ప్ర‌భుత్వం కొంత ఊర‌ట ఫీలైంది. ముందునుంచి తాము వాదిస్తున్న వాద‌న‌నే గ‌వ‌ర్న‌ర్ కూడా చెప్ప‌డంతో కేసీఆర్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక‌, అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత విష‌యంలో క‌ఠినంగా ఉండాల‌ని కూడా కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

Loading...

Leave a Reply

*