ఈ నెంబ‌ర్ వాడితే చచ్చిపోతారు…!

no

మీరు హార‌ర్ థ్రిల్ల‌ర్‌లు చూసే ఉంటారు. ఒక ఇంట్లోకి అడుగుపెడితే చాలు.. గ్యారంటీగా అంద‌రూ చ‌నిపోతుంటారు. ఆ ఇంటిని ఏదో ప్రేతాత్మ‌, భూతం, దెయ్యం వెంటాడుతూ ఉంటుంది. రీసెంట్‌గా ఈ జాన‌ర్ సినిమాలు బోలెడు వ‌చ్చాయి. ఇలాంటిదే ఓ మొబైల్ నెంబ‌ర్‌కి కూడా వ‌చ్చేసింది. ఆ నెంబ‌ర్ వాడివ వాళ్లంతా మృత్యు ఒడికి చేరుకుంటున్నారు. ఆ నెంబ‌ర్ ఏంటంటే.. 0888888888. నెంబ‌ర్ మాత్రం భారీ ఫ్యాన్సీ నెంబ‌ర్. కానీ, ఈ నెంబ‌ర్ చూసి ముగ్దులై తీసుకున్న‌వాళ్లంతా చ‌నిపోతున్నారు. ఈ మ‌ర‌ణాల మిస్ట‌రీ ఏంట‌నేది హాట్ టాపిక్‌గా మారింది.

బ‌ల్గేరియాలోని మొబిటెల్ కంపెనీ ఈ నెంబ‌ర్‌ని ఇచ్చింది. ఈ నెంబ‌ర్‌ని మొట్ట‌మొద‌ట వాడింది ఆ కంపెనీ సీఈవో వ్లాదిమిర్ గ్రాస్న‌వ్‌. ఆయ‌న 2001లో క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించాడు. అయితే, ఆయ‌న మ‌ర‌ణంపై ఓ వార్తా ప‌త్రిక ప్ర‌చురించిన క‌థ‌నం ఆస‌క్తిగా మారింది. వ్లాదిమిర్ గ్రాస్న‌వ్‌.. చ‌నిపోయింది కేన్స‌ర్‌తో కాదు బిజినెస్ గొడ‌వ‌ల‌తో అని ఆ ప‌త్రిక రాసింది. ఆయ‌న‌పై హానికార‌క రేడియో యాక్టివ్ పాయిజినింగ్ జ‌రిగిన‌ట్లు తెలిపింది. ఆ త‌ర్వాత ఈ నెంబ‌ర్‌ను 2003లో కాన్‌స్టాంటిన్ డిమిట్రోవ్ అనే మాఫియా డాన్ వాడాడు. అత‌ను అనూహ్యంగా ఓ రౌడీషీట‌ర్ చేతిలో హ‌త్య‌కు గుర‌య్యాడు.

ఇక‌, 2005లో ఇదే నెంబ‌ర్‌ని దిష్‌లీవ్ అనే బిజినెస్ మేన్ తీసుకున్నాడు. ఇత‌ను కూడా హ‌త్యకు గుర‌య్యాడు. దీంతో, మొబిటెల్‌కి ఏం అనుమానం వ‌చ్చిందో ఏమో ఆ నెంబర్‌ని బ్లాక్ చేశారు. అప్ప‌టినుంచి ఇంత‌వ‌ర‌కు మ‌రెవ‌రికీ ఆ నెంబ‌ర్‌ని ఇవ్వ‌లేదు. ఈ నెంబ‌ర్ కోసం ఎవ‌రైనా ట్రై చేస్తే.. అవుట్ ఆఫ్ నెట్‌వ‌ర్క్ క‌వ‌రేజ్ ఏరియా అని స‌మాధానం వ‌స్తుంది. ఈ నెంబ‌ర్‌ని వాడిన వినియోగ‌దారులు ఎందుకు చ‌నిపోతున్నార‌న్న ప్ర‌శ్న‌కు కంపెనీ అనూహ్య‌మైన స‌మాధానం ఇచ్చింది. దీనిపై ఎలాంటి కామెంట్స్ చెయ్య‌మ‌ని, అయినా వ్య‌క్తిగ‌త నెంబ‌ర్‌ల గురించి మాట్లాడ‌మ‌ని వివ‌రించింది. ఇదే అనుమానాల‌ను మ‌రింత రేపుతోంది. ఇంత‌కీ, ఆ నెంబ‌ర్‌ల‌కీ, ఈ మ‌ర్డ‌ర్‌ల‌కు లింక్ ఏంట‌నేది హాట్ టాపిక్‌గా మారింది.

Loading...

Leave a Reply

*