డ్ర‌గ్స్‌తో కండ‌లు పెంచాడు

drugs

అత‌డు గండ‌ర‌గండ‌డు కాదు.. కండ‌ర‌గండ‌డు.. కొండ‌ల‌ను కూడా పిండి చేసే కండ‌ల‌వీరుడు ఇత‌డు… ప్ర‌పంచంలోని కండ‌ల‌వీరుల్లో ఇత‌డికి కూడా చోటుంది… చూడ‌డానికి బ‌క్క‌గా ఉన్నా చొక్కా విప్పితే బ‌నియ‌న్‌ చిరిగిపోద్ది… కండ‌లు ఉప్పొంగుతాయి… వాడి కండ‌లు చూస్తే మ‌న‌కు క‌ళ్లు బైర్లు క‌మ్ముతాయి… వీడికి ఎంత కండ‌కావ‌రం అనుకుంటాం.. మ‌నోడి పేరు వాల్దిర్ సెగాటో… వ‌య‌సు 48… ఊరు బ్రెజిల్‌లోని సావోపోలో…కూలీనాలీ  చేసుకుంటూ బ‌తుకుతాడు… అయితే మ‌నోడు కామ‌న్‌మేనే అయినా పెద్ద గోల్ పెట్టుకున్నాడు… ప్ర‌పంచంలో అందరికంటే పెద్ద కండ‌లు పెంచాల‌నే అతి పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు సెగాటో…. దీనికోసం కొన్నేళ్లుగా తెగ క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు..

అయితే జిమ్మును మాత్ర‌మే న‌మ్ముకుంటే స‌రిపోద‌ని భావించిన సెగాటో డ్ర‌గ్స్‌ని కూడా న‌మ్ముకు న్నాడు… ఫాస్ట్‌గా బాడీ పెంచాలంటే డ్ర‌గ్స్‌తోనే సాధ్య‌మ‌ని న‌మ్మాడు.. ఎక్స‌ర్‌సైజుల‌కు తోడు డ్ర‌గ్స్ ఉప‌యోగించ‌డం మొద‌లుపెట్టాడు…. ఇప్పుడు సెగాటో త‌న బైసెప్ అంటే చేతికండ సైజును 23 అంగుళాల దాకా పెంచాడు…. సాధార‌ణంగా 12 ఇంచులు ఉండే కండ‌ను అంత పెంచ‌డం గొప్ప విష‌య‌మే… అయితే అది ప్ర‌పంచ రికార్డు మాత్రం కాదు… ఈజిప్టుకు చెందిన ముస్తాఫా అనే మ‌హాబ‌లుడి బైసెప్ 31 అంగుళాలు ఉంటుంది… క‌నీసం 27 అంగుళాల బైసెప్స్ అన్నా సాధించి అమెరికా ఖండంలో అతి పెద్ద‌ కండ‌ర‌గండ‌డిగా నిల‌వాల‌న్న‌ది సెగాటో క‌ల‌..ఇత‌డు తొంద‌ర‌గా, భారీగా కండ‌లు పెర‌గ‌డానికి సింథాల్ అని ఆయిల్‌ను ఉప‌యోగిస్తున్నాడు…

ప్ర‌మాద‌క‌ర‌మైన ఆ ఆయిల్‌ను ఇంజెక్ష‌న్ల ద్వారా నేరుగా కండల్లోకి ఎక్కించుకుంటున్నాడు…. త‌న‌ను అంద‌రు హీమ్యాన్‌, ష్వార్జ్‌నెగ్గ‌ర్‌, హ‌ల్క్ అని పిల‌వాల‌నే పిచ్చి కోరిక‌తో సెగాటో ఇలా చేస్తున్నాడు… సో ఇప్పుడు ఇవి ఒరిజిన‌ల్ కండ‌లు కావు.. డ్ర‌గ్స్ అండ‌దండ‌ల‌తో పెంచిన కండ‌లు…. రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ అంటూ జిమ్ములో క‌స‌ర‌త్తులు చేసి పెంచిన కండ‌లు కావు… ఒళ్లు వంచి వ్యాయామ‌శాల‌లో చెమ‌ట‌లు చిందించి పెంచిన కండ‌లు కావు ఇవి… అయితే వీడు బాహుబ‌లిగా మారాల‌ని చూసి చివ‌ర‌కు బ‌లైపోయేలా ఉన్నాడ‌ని స్నేహితులు వాపోతున్నారు. కండ‌ల్లోకి ప‌ట్టించిన అయిల్ లీక్ అయితే సెగాటో షేక్ అయిపోయి గాలి తీసిన బూర‌ల్లా అత‌డి కండ‌లు క‌రిగిపోతాయ‌ని స్నేహితులు ఎద్దేవా చేస్తున్నారు.

Loading...

Leave a Reply

*