షాకింగ్.. ప‌చ్చి ర‌క్తంలో సోడా క‌లుపుకొని తాగుతున్న త‌మిళీయులు…!

tamilanadu

ఉడుం ప‌ట్టు ప‌ట్టాలి.. అంటారు. నీటిలో ఉన్న ముస‌లినిసైతం ఒడ్డుకు లాగ‌గ‌ల శ‌క్తి ఒక్క ఉడుముకే ఉందంటారు మ‌న పెద్ద‌లు. అయితే, తమిళీయులు మాత్రం ఉడుం ప‌ట్టు కాదు.. ఉడుం ర‌క్తం అంటున్నారు. ఇదేంటి అనుకుంటున్నారా….? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉడుముల్ని ప‌ట్టుకొని ముక్క‌లు ముక్కలుగా కోసి దాని ర‌క్తాన్ని పిండుకొని సోడాలో క‌లుపుకొని జ్యూస్ తాగిన‌ట్లు తాగుతున్నారు త‌మిళీయులు. ఈ వీడియో దానికి సంబంధించిన‌దే.

ఉడుము ప‌చ్చినెత్తురుకి కొన్ని శ‌క్తులున్నాయ‌ని, అది తాగితే.. మాన‌వ శ‌రీరం మ‌రింత బ‌లంగా, పుష్టిగా మారుతుంద‌ని ఎవ‌రో చెప్పార‌ట‌. ఉడుం మాదిరి బ‌లం, శ‌క్తి మీకు రావాలంటే.. మీరు మా ద‌గ్గ‌రికిరావాల‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నార‌ట‌. అంతే, ఉడుముల‌కి తెగ డిమాండ్ ఏర్ప‌డింది. త‌మిళనాడులోని కొంద‌రు గిరిజ‌నులు ఉడుముల‌ను పట్టుకొచ్చి దాని ర‌క్తాన్ని న‌డిరోడ్డు మీదే పిండి అమ్ముతున్నార‌ట‌. దీంతో, ఎవ‌రో దానిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

అయితే, ఇలాంటి వ‌న్య ప్రాణుల‌ని చంపి.. దాని ర‌క్తాన్ని గ్లాసుల‌లో అమ్మ‌డం చ‌ట్ట వ్య‌తిరేక‌మ‌ని, దీనిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు అట‌వీ శాఖ అధికారులు. ఈ వీడియో ఎవ‌రు అప్‌లోడ్ చేశారో… అది ఎక్క‌డ జ‌రిగిందో వంటి అంశాల‌పై ఇప్ప‌టికే అధికారులు నిఘా పెట్టార‌ట‌. త్వ‌ర‌లోనే దానిని క‌నిపెట్టి వారిపై కేసు నమోదు చేస్తామ‌ని చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*